సోనియాని అంబులెన్స్‌లో తీసుకెళ్లాల్సింది: నరేంద్రమోడీ

సోనియా అస్వస్థత, డిశ్చార్జ్ పైన మోడీ ట్విట్టర్‌లో స్పందించారు. సోనియా ఆరోగ్యం కుదుటపడి ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చారని తెలిసి సంతోషిస్తున్నానని, ఆమె ఎప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని తాను కోరుకుంటున్నారని ఆయన ట్వీట్ చేశారు.
అస్వస్థతకు గురైన సమయంలో అత్యాధునిక, పూర్తి సౌకర్యాలు ఉన్న అంబులెన్స్ వాడలేదన్నారు. పార్లమెంటులో చక్రాల కుర్చీ కానీ స్ట్రెచర్ కానీ అందుబాటులో ఉంటే బాగుండేదన్నారు. సోనియాను ఆసుపత్రికి తరలించడంలో అత్యవసర వైద్య విధానాలు కూడా పాటించలేదన్నారు.
కాగా, సోమవారం రాత్రి ఆహార భద్రత బిల్లు పైన లోకసభలో ఓటింగ్ జరుగుతున్న సమయంలో సోనియా గాంధీ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆమెను కేంద్రమంత్రి సెల్జా ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం సోనియాను డిశ్చార్జ్ చేశారు.












Click it and Unblock the Notifications