జగన్ కేసు: అర్ధరాత్రి వరకు గీతారెడ్డిని ప్రశ్నించిన సిబిఐ

Geetha Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో మంత్రి గీతా రెడ్డిని మంగళవారం రాత్రి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. గీతా రెడ్డి నివాసంలో రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటల వరకు గీతా రెడ్డిని ప్రశ్నించారని తెలుస్తోంది.

జగన్ ఆస్తుల జఫ్తుపై ఈడి విచారణ

ఈడి జప్తు చేసిన జగన్ అక్రమాస్తులపై మంగళవారం ఈడి న్యాయ ప్రాధికార సంస్థ విచారణ జరిపింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ ఇప్పటి వరకు రూ.229.40 కోట్ల ఆస్తులను మూడు విడతలుగా స్వాధీనం చేసుకొంది. మొదటి రెండు జప్తులపై ఇప్పటికే విచారణ జరిపిన న్యాయప్రాధి కార సంస్థ.. ఈడి చర్యలను సమర్థించింది. గత మే 31న మూడో విడతగా చేసిన రూ 34.66 కోట్ల జప్తునకు సంబంధించిన కేసుపై మంగళవారం విచారణ చేపట్టారు.

చెన్నై వ్యాపారవేత్తలు ఎకె దండమూడి, టిఆర్ కన్నన్, మాధవ్ రామచంద్ర.. జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్‌లో రూ.34.66 కోట్ల మేర పెట్టుబడి పెట్టారు. అయితే ఈ మొత్తం అక్రమ సంపాదనే అని విచారణలో తేలిందని పేర్కొన్న ఈడి.. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్5(1) మేరకు కేసు నమోదు చేసింది.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జగతి పబ్లికేషన్ ఖాతాలో ఉన్న రూ.34.66 కోట్లను జప్తు చేసింది. అయితే దండమూడి, కన్నన్, మాధవ్ రామచంద్ర లాభాలను ఆశించే పెట్టుబడులు పెట్టారని, వారిని ఎవరూ భయపెట్టలేదని జగన్ తరపున లాయర్లు వాదించారు. ఈ కేసులో అదనపు సమాచారం ఇవ్వడానికి మరింత సమయం కావాలని జగన్ లాయర్లు కోరడంతో తదుపరి విచారణను సెప్టెంబర్ 27వ తేదీకి వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+