ఘోరం: బాలికపై అత్యాచారం, ఆలస్యంగా వెలుగులోకి

sexual assault against girl in Karimnagar district
కరీంనగర్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదేళ్ల బాలిక ఆగస్టు 15న అత్యాచారానికి గురైన సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటన జరిగిన 12 రోజుల అనంతరం మంగళవారం ఘోర సంఘటన బయటకు వచ్చింది.ఆశ్రమ పాఠశాల వంట మనిషే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం.

కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక ఆశ్రమ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. ఆగస్టు 15న రాత్రి వంట మనిషి రాజ్ మహ్మద్ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

బాలిక పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులు, సిబ్బంది సంఘటన బయటపడకుండా ఉండేందుకు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దీంతో బాలిక పరిస్థితి తొమ్మిది రోజుల్లో మరింత విషమంగా మారింది.ఈ విషయం తెలుసుకున్న జమ్మికుంట సీఐ దాసరి భూమయ్య వెంటనే స్పందించి విచారణ చేపట్టారు.

ఆ సమయంలో ఉపాధ్యాయులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో విధుల్లో ఉన్న దినసరి కూలీ వనిత నుంచి వివరాలు సేకరించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సెల్‌ఫోన్‌లు స్వీచ్ ఆఫ్ చేసి ఉండటంతో బాలిక వద్ద వివరాలు సేకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+