నరేంద్ర మోడీతో ఆస్ట్రేలియా ప్రతినిధుల భేటీ (పిక్చర్స్)

గాంధీనగర్: క్వీన్స్‌లాండ్ ఉప ప్రధాని జెఫ్రీ విలియమ్ సీనీ, ఇతర ప్రతినిధులు మంగళవారం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. భారత, ఆస్ట్రేలియా మధ్య పరస్పర అభివృద్ధికి అవకాశం ఉన్న రంగాలపై వారు మోడీతో చర్చించారు. సీనీ క్వీన్స్‌లాండ్ అభివృద్ధి, మౌలికసదుపాయాలు, ప్రణాళిక శాఖల మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు.

సీనీ ప్రతినిధి బృందంలో ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ మార్క్ పియర్స్ కూడా ఉన్నారు. నరేండ్ర మోడీ అదనపు ముఖ్య కార్యదర్శి ఎకె శర్మ, అదనపు ప్రధాన కార్యదర్శి మహేశ్వర సాహు, పారిశ్రామికవేత్త గౌతం ఆదాని కూడా సమావేశంలో పాల్గొన్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మార్పిడికి గురవుతున్న నేపథ్యంలో గుజరాత్, ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను పెంచుకునే అభివృద్ధి విధానాలపై భేటీలో చర్చ జరిగింది. గుజరాత్, క్వీన్స్‌లాండ్ మధ్య వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి గల వివిధ అవకాశాలను వినియోగించుకోవడంపై, ఆర్థికాభివృద్ధి స్థిరతకు, ఆర్థిక చలనశీలతపై మోడీ సీనీ మాట్లాడుకున్నారు.

వచ్చే నెలలో జరిగే మూడు రోజుల ప్రపంచ వ్యవసాయ సదస్సుకు ప్రతినిధులను పంపాలని మోడీ ఆస్ట్రేలియా ప్రతినిధులను కోరారు.

నరేంద్ర మోడీ జెఫ్రీ విలియమ్ సీనీ

నరేంద్ర మోడీ జెఫ్రీ విలియమ్ సీనీ

ఆస్ట్రేలియా ప్రతినిధుల పర్యటన సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో చర్చిస్తున్న క్వీన్స్‌లాండ్ ఉప ప్రధాని జెఫ్రీ విలియమ్ సీనీ భేటీ..

ఆస్ట్రేలియాతో మోడీ సంబంధఝం

ఆస్ట్రేలియాతో మోడీ సంబంధఝం

మంగళవారం తమతో సమావేశమైన ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందంతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ఆయన అధికారులు..

ఆస్ట్రేలియా ప్రతినిధులకు సన్మానం

ఆస్ట్రేలియా ప్రతినిధులకు సన్మానం

ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందాన్ని సత్కరిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రచార రథసారథి నరేంద్ర మోడీ.

మోడీతో సీనీ ఇలా..

మోడీతో సీనీ ఇలా..

తన కార్యాలయంలో క్వీన్స్‌లాండ్ ఉప ప్రధాని జెఫ్రీ విలియమ్ సీనీతో మాట్లాడుతున్న నరేంద్ర మోడీ..

అస్ట్రేలియా ప్రతినిధుల స్వాగతం

అస్ట్రేలియా ప్రతినిధుల స్వాగతం

ఆస్ట్రేలియా ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ. క్వీన్స్‌లాండ్ ఉప ప్రధాని జెఫ్రీ విలియమ్ సీనీ నేతృత్వంలోని ప్రతినిధులు మంగళవారం నరేంద్ర మోడీని కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+