ఒంటరిగా వెళ్లొద్దు, మనకు కృష్ణుడు లేడు: హేమమాలిని

ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజలకు మరింత మెరుగైన రక్షణ కల్పించాలని ఆమె ప్రభుత్వాలను, పోలీసులను కోరారు. ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లవద్దని, దీనిని తీసిపారేయకండని, ఏమైనా జరగవచ్చునని, మీరు కూడా బాధితురాలు కావొచ్చునని ఆమె జాగ్రత్త చెప్పారు.
మిమ్మల్ని రక్షించేందుకు ఎవరు ముందుకు రారని, శ్రీకృష్ణుడు ద్రౌపదిని రక్షించారని, అలాగని ద్రౌపదితో పోల్చుకొని కృష్ణుడు వచ్చి కాపాడుతాడని అనుకోవద్దన్నారు. కాగా, ఇటీవల దేశంలో వరుస అత్యాచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మంబై సాముహిక అత్యాచారం నేపథ్యంలో ఆమె పై విధంగా స్పందించారు.
ముంబై అత్యాచార నిందితులపై విచారణ
ముంబై ఫోటో జర్నలిస్టు పాత్రికేయురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు బుధవారం సంఘటన స్థలమైన శక్తి మిల్స్ ప్రాంగణానికి తీసుకు వెళ్లారు. అక్కడ ఆ నేరానికి దారి తీసిన సంఘటనల క్రమాన్ని, నిందితులు అత్యాచారానికి పాల్పడ్డ తీరును తెలుసుతున్నారు. మరోవైపు బాధితురాలిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆమె అనుబంధ వాంగ్మూలాన్ని కూడా తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications