కడపలో ఉద్రిక్తత, విద్యార్థి ఆత్మహత్య: టిఎస్సార్‌కు సెగ

హైదరాబాద్: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఆందోళనలు శనివారం 32వ రోజు కూడా కొనసాగుతన్నాయి. విశాఖపట్నం జిల్లాలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డికి సమైక్య సెగ తగిలింగి. ఆందోళనకారులకు సంఘీభావం తెలపడానికి వచ్చిన ఆయనను అడ్డుకున్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో ముస్లింల జెఎసి ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ చేపట్టారు. దానికి వచ్చిన సుబ్బిరామిరెడ్డిని అడ్డుకున్నారు. రాజీనామాను ఆమోదింపజేసుకుని దీక్షలో పాల్గొనాలని వారు డిమాండ్ చేశారు.

కృష్ణా జిల్లా విజయవాడలో డివి మానర్ సర్కిల్ వద్ద దేవినేని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మూడు వేల మంది విద్యార్థులతో ర్యాలీ, మానవ హారం నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మచిలీపట్నం లోకసభ సభ్యుడు కొనకళ్ల నారాయణ పాల్గొన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టిడిపి నేత గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.

TSR

కడపలో రెండు లక్షల మందితో శనివారం చేపట్టిన సమైక్య గళ గర్జనకు పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసుల ఆంక్షలపై ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశఆరు. ఎస్పీ కార్యాలయం ముట్టడికి సమైక్యవాదులు బయలుదేరారు. వారిని కలెక్టర్ బంగ్లా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, సమైక్యవాదులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసుల ఆంక్షలతో కడపలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కోటిరెడ్డి కూడలికి నాలుగు వైపులా ముళ్ల కంచె వేసి దిగ్బంధం చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో శనివారంనాడు మహా మానవహారం నిర్వహించారు. పలు ప్రాంతాల మీదుగా ఈ మానవహారం ఏర్పడింది. మానవహారానికి వచ్చి వెనక్కి వెళ్తూ ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విషాద వాతావరణం నెలకొంది. నర్సీపట్నంలో ఎండ్లబండి ప్రదర్శన నిర్వహించారు. పిఠాపురంలో సమైక్య గళ గర్జన జరిగింది. తెలంగాణ తీర్మానం పెడితే తాను కాంగ్రెసు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని మంత్రి విశ్వరూప్ తూర్పు గోదావరి జిల్లాలో చెప్పారు. రాష్ట్ర సమైక్యంగానే ఉంటుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+