చిరు జెండా పీకేశారని బాబు: కాంగ్, జగన్ పార్టీకి వార్న్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతకాని సిఎం అన్నారు. ఆయన లీకుల వీరుడే తప్ప చేతలేం చేయలేడన్నారు. సాధారణ ఎన్నికలకు ముందు చిరంజీవి ఏదో చేస్తానని వచ్చారని, ఆ తర్వాత ఆయన కాంగ్రెసు పార్టీలో కలిసిపోయేందుకు జెండా పీకేశారన్నారు. చిరంజీవి లాగే కెసిఆర్, జగన్‌లు కూడా కాంగ్రెసు పార్టీలోనే కలుస్తారన్నారు. దీనిని ప్రజలు గుర్తించాలన్నారు. జగన్ సాక్షికి తన పైన విమర్శలు గుప్పించడమే తెలుసన్నారు.
టిడిపికి, తనకు మాత్రం తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యమన్నారు. తనకు జగన్‌లా కేసుల మాపీ వంటివి లేవన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు సీమాంధ్రులకు న్యాయం కోసమంటూ పార్లమెంటులో ఆందోళనలు చేస్తుంటే కాంగ్రెసు సభ్యులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సోనియాకు పెంపుడు కుక్కల్లా ఉన్నారని మండిపడ్డారు. తెలుగు జాతితో పెట్టుకుంటే కాంగ్రెసుకు శృంగభంగం తప్పదన్నారు. విభజన చేసేటప్పుడు సమస్యలు అన్ని పరిష్కరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
తనకు ప్రధాని అపాయింటుమెంటు ఇవ్వలేదు కానీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఇచ్చారన్నారు. జగన్‌కు సహకరిస్తే సోనియాకు సహకరించినట్లే అన్నారు. కాంగ్రెసు పార్టీ ఇక్కడ జగన్, అక్కడ తెరాసతో కలిసి వెళ్తుందన్నారు. తెలుగు ప్రజలు చూపించే అభిమానానికి తాను రుణం తీర్చుకుంటానన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాళ్లు తమ పార్టీ వారి జోలికి రావొద్దని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications