ఆ ముగ్గురిపై కడియం, విజయమ్మపై సిఎం రమేష్

Chameleons are better than politicians: Kadiyam
హైదరాబాద్: తెలంగాణపై నిత్యం తమ స్టాండ్ మార్చుకునే రాజకీయ నాయకుల కంటే ఊసరవెల్లులు ఎంతో నయమని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కడియం శ్రీహరి ఆదివారం విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు మూర్ఖులే అన్నారు. పార్టీలకు రాజకీయ విధానాలు ఉండాలి ఆ మేరకు తీసుకున్న నిర్ణయాలపై కట్టుబడి ఉండాలి.

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా స్పందించిన ఈ పార్టీలు ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నాయని ప్రశ్నించారు. ఊసరవెళ్లులు కూడా సిగ్గుపడే విధంగా ఈ పార్టీల నాయకులు తమ రాజకీయ రంగులను మార్చుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. తాము ఒప్పుకోమని తెలంగాణ ప్రజలు తెగేసి చెబుతున్నప్పటికీ మీతో కలిసుంటామంటూ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చెప్పడం సిగ్గుచేటన్నారు.

ప్రమాణం చేసి చెప్పండి: సిఎం రమేష్

ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మలపై టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ హైదరాబాదులో ధ్వజమెత్తారు. ఢిల్లీలో తన కొడుకును ప్రధానమంత్రిని చేయాలని సోనియా, రాష్ట్రంలో జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని విజయమ్మ కలిసి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. కొడుకుల కోసం సోనియా, విజయమ్మలు కుట్రలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.

వీరిద్దరి నడుమ కుదిరిన ఒప్పందంలో భాగంగానే షర్మిల సమైక్య శంఖరావం పేరుతో యాత్ర చేపడుతోందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దీక్షలు, యాత్రలు వెనక ఢిల్లీ డైరెక్షన్ ఉందన్నారు. బైబిల్ మీద ప్రమాణం చేసి నిజం చెప్పాలని, ఈ ఆరు నెలల్లో ఎన్నిసార్లు సోనియాను, అహ్మద్‌పటేల్‌ని కలిశారని ప్రశ్నించారు. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళితే అందరికీ తెలిసిపోతుందని బెంగళూరు అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లి సంప్రదింపులు జరిపి వస్తున్నారని ఆరోపించారు.

వీరి మధ్య ఒప్పందం కుదిరిన తర్వాతే రాష్ట్రాన్ని విభజిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణలో తెరాసని, సీమాంధ్రలో జగన్ పార్టీని కలుపుకుని లాభపడాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. విభజన నేపథ్యంలో సీమాంధ్రలో వెల్లువెత్తిన ప్రజాగ్రహన్ని చూసి ఎన్నికల తర్వాత మాత్రమే జగన్ పార్టీని కలుపుకోవడం ద్వారా లాభపడాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కలవబోమని ఆ పార్టీ చెప్పగలదా అని ప్రశ్నించారు.

కేంద్రంలో సైతం కాంగ్రెస్సేతర పక్షాలను ఒకతాటి మీదకు తీసుకురాగల సత్తా చంద్రబాబుకే ఉందన్నారు. మాట తప్పం... మడమ తిప్పమని చెప్పుకునే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సోమవారం నుంచి చేపట్టనున్న యాత్రకు సమైక్య శంఖరావం పేరుకి బదులు మాట తప్పే... మడమ తిప్పే యాత్రగా పేరు మార్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. జగన్‌ను నమ్మి తెలంగాణలో మంత్రి పదవులను, శాసనసమండలి సభ్యత్వాలను వదులుకుని వచ్చిన వాళ్లను ఆ పార్టీ నాయకత్వం నట్టేట ముంచిందన్నారు. బాబు హయాంలో తెలంగాణలో ఇంత సెంటిమెంట్ లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+