సీమాంధ్ర ప్రజలకు ఓదార్పుకే: బాబు యాత్రపై ఎర్రబెల్లి

రాజకీయ ప్రయోజనాలు పొందడానికే కాంగ్రెసు అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీసుకుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లాలో అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు నష్టం చేసే రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన కాంగ్రెసు అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. ప్రపంచ పటంలో హైదరాబాదుకు గుర్తింపు తెచ్చింది తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడేనని ఆయన అన్నారు.
మిగిలింది దోచుకోవడానికే..
తండ్రి దోచుకోగా మిగిలింది పూడ్చేందుకే షర్మిల దోపిడీ శంఖారావం యాత్ర చేపట్టారని తెలుగుదేశం నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. విజయమ్మ ఇకనైనా వైయస్ చేసిన పాపాలను గ్రహించాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సీమాంధ్ర ప్రజల ఉద్యమాన్ని కించపరిచే విధంగా మంత్రి కొండ్రు మురళి మాట్లాడారని ఆయన అన్నారు.
సీమాంధ్ర నేతల ఓట్ల కోసమే చంద్రబాబు నాయుడు సీమాంధ్ర యాత్ర చేస్తున్న విషయాన్ని ఆ ప్రాంత ప్రజలు గ్రహించాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో అధికారం కోసమే చంద్రబాబు ఎత్తుగడ వేస్తున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications