సభనుండి ఎంపీల సస్పెన్షన్: రిజైన్‌కు చిరు, పురంధేశ్వరి

సస్పెన్షన్‌కు గురైన వారిలో టిడిపి ఎంపీలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కొనకళ్ల నారాయణ, శివ ప్రసాద్, నిమ్మల కిష్టప్ప, కాంగ్రెసు ఎంపీలు సాయి ప్రతాప్, అనంత వెంకట్రామి రెడ్డి, కనుమూరి బాపిరాజు, లగడపాటి రాజగోపాల్, మాగుంట శ్రీనివాస్‌లు ఉన్నారు.
రాజీనామాకు కేంద్రమంత్రులు సిద్ధం
విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెసు పార్టీ దానిపై వెనక్కి వెళ్లకపోతే సీమాంధ్రకు చెందిన ఐదుగురు కేంద్రమంత్రులు రాజీనామాకు సిద్ధమయ్యారని సమాచారం. నలుగురు మంత్రులు మాత్రం రాజీనామాకు మొగ్గు చూపడం లేదు.
రాజీనామాకు సిద్ధపడిన వారిలో కేంద్రమంత్రులు చిరంజీవి, పురంధేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పళ్లం రాజు, కావూరి సాంబశివ రావులు ఉన్నారు. కిషోర్ చంద్రదేవ్, జెడి శీలం, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణిలు మాత్రం రాజీనామాలతో లాభం లేదని, అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications