శివప్రసాద్‌కు కాంగ్రెస్ ఎంపి బెదిరింపు, దౌర్జన్యం: నామా

సభ్యులు తమ తమ అభిప్రాయాలకనుగుణంగా నిరసన వ్యక్తం చేసుకోవచ్చునని అన్నారు. అందుకే ఇందిరా గాంధీ మాస్కుతో తమ ఎంపీలు వచ్చారన్నారు. పార్లమెంటులో నిరసనకు దిగిన శివ ప్రసాద్‌ను సందీప్ దూషించడం ఏమాత్రం సరికాదన్నారు. ఆయన పైన స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
తెలుగుజాతిని అవమానించేలా కాంగ్రెసు తీరు ఉందన్నారు. సందీప్ తెలుగు వారిని అవమానపర్చేలా మాట్లాడారన్నారు. గూండాగిరి చేసే వారిని కాంగ్రెసు విప్‌గా పెట్టుకుందన్నారు.తెలంగాణ విషయంలో తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఉన్నారన్నారు. గతంలో తాను సమైక్యం అన్నానని, ఆ తర్వాత సెంటిమెంట్ దృష్ట్యా తాను లేఖ ఇచ్చానని చెప్పారన్నారు.
తెలంగాణ ఆగదు: గండ్ర
ఎవరు ఒత్తిళ్లు తెచ్చినా, ఏం చేసినా కాంగ్రెసు పార్టీ తెలంగాణపై వెనక్కి వెళ్లదని ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆగేది కాదని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాంతానికో మాట మాట్లాడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications