గంగా జలం కావాల్సిందే: జైలులో మొండికేసిన ఆశారాం
రాజస్థాన్: జోధ్ పూర్ సెంట్రల్ జైలులో ఉన్న వివాదస్పద స్వామిజీ ఆశారాం బాపు అక్కడి నీరు కూడా తాగడం లేదు. తను తాగే నీరులో ఒక చుక్క అయినా గంగా జలం ఉండాలని ఆయన కోరుతున్నారు. లేదంటే తాను ఆ నీరు తాగలేనని చెబుతున్నట్లు సమాచారం.
16ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారనే ఫిర్యాదుతో 75ఏళ్ల ఆశారాం బాపును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో జైలు ఎదుట ఆశారాం బాపు మద్దతుదారులు ఆందోళనకు దిగారు. పోలీసులకు మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది.

అంతకుముందు ఆశారాంకు జోధ్ పూర్ లోని ఆస్పత్రిలో పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలో ఆశారాంకు లైంగిక సామర్థ్యం ఉన్నట్లు తేలింది. లైంగిక సామర్థ్యం ఉన్న ఆశారాం నేరం చేసే అవకాశం ఉందని పోలీసులు నిర్ధారించారు. విచారణ పూర్తయిందని పోలీసులు తెలిపారు.
బాధిత బాలిక తల్లిదంద్రడుల ఫిర్యాదు మేరకు గత శనివారం అర్ధరాత్రి ఆశారాం బాపును తన జోధ్ పూర్ ఆశ్రమంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు ఆశారాంను కోర్టులో హాజరు పర్చగా 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అరెస్ట్ కు నిరసనగా ఆశారాం మద్దతుదారులు జర్నలిస్టులు, పోలీసులపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందె.












Click it and Unblock the Notifications