మీరు సమైక్యమనండి: ఢిల్లీలో సిఎం బిజీ బిజీ(పిక్చర్స్)

న్యూఢిల్లీ: మఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం రాత్రి పదిన్నర గంటలకు హైదరాబాదుకు రానున్నారు. కిరణ్ మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన నిన్న రాత్రి ఆంటోని కమిటీని కలిశారు. కమిటీ ముందు మరోసారి సమైక్యవాదన వినిపించారు.

విభజన జరిగితే నీరు, ఉద్యోగాలు, హైదరాబాద్ సమస్యలు వస్తాయని చెప్పారు. బుధవారం ఉదయం ఆయన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. విభజనకు ఎలాగూ నిర్ణయం తీసుకున్నారని, ఆ నిర్ణయాన్ని వచ్చే ఎన్నికల వరకు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది.

కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు డిగ్గీతో పాటు మరికొందరు నేతలను, రాష్ట్రానికి చెందిన పలువురి నేతలతో భేటీ అయ్యారు. ఆయన ఈ రోజు రాత్రికి హైదరాబాదుకు చేరుకోనున్నారు. సిడబ్ల్యూసి ప్రకటన తదనంతర పరిణామాలపై ఢిల్లీ పెద్దలకు ముఖ్యమంత్రి నివేదిక ఇస్తున్నారని తెలుస్తోంది.

ఢిల్లీలో కిరణ్

ఢిల్లీలో కిరణ్

మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజనపై కాంగ్రెసు పార్టీ వేసిన ఆంటోని కమిటీని కలిసి మరోసారి తమ సమైక్యగళం వినిపించారు.

కిరణ్

కిరణ్

మంగళవారం రాత్రి ఆంటోని కమిటీని కలిసిన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే ఎన్నో సమస్యలు వస్తాయని చెప్పారు. సీమాంధ్రలో పార్టీకి కష్టకాలం తప్పదని హెచ్చరించారు.

ఆంటోనీ

ఆంటోనీ

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం రాత్రి ఎకె ఆంటోని కమిటీతో భేటీ అయ్యారు. సిడబ్ల్యూసి ప్రకటన అనంతరం రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ఆయన వివరించారు.

డిగ్గీకి సీమాంధ్ర నేతల విజ్ఞప్తి

డిగ్గీకి సీమాంధ్ర నేతల విజ్ఞప్తి

సమైక్యాంధ్రకు అనుకూలంగా సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆంటోని కమిటీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+