జగన్ జైలును క్యాంప్ ఆఫీస్ చేసుకున్నాడు: ఎర్రబెల్లి

వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీతో పరోక్ష మంతనాలు జరుపుతున్నారని, జైలునుంచి జగన్‌ను విడుదల చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణలో తెరాసతో, సీమాంధ్రలో వైయస్ జగన్‌తో కాంగ్రెసు కుమ్మక్కయి తమ పార్టీని దెబ్బ తీయాలని చూస్తోందని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బ తీయవద్దని కోరుతూ చంద్రబాబు సీమాంధ్రలో పర్యటన చేయడం తప్పా అని ఆయన అడిగారు.
రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెసు, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలంగాణ జెఎసి కలిసి డ్రామాలు ఆడుతున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణపై తమ పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందని, వైఖరిలో మార్పు రాలేదని ఆయన అన్నారు. తెలంగాణలోనూ సీమాంధ్రలోనూ మంట పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆయన అన్నారు. ఇరు ప్రాంతాలకు చెందిన వివిధ వర్గా మధ్య చర్చలు ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాల్సి ఉండిందని ఆయన అన్నారు.
తటస్థంగా ఉండాల్సిన తెలంగాణ జెఎసి కాంగ్రెసు, తెరాసలతో కలిసి తెలంగాణ సెంటిమెంటును అడ్డం పెట్టుకుని తమ పార్టీ దెబ్బ తీయాలని ప్రయత్నాలు చేశాయని తెలుగుదేశం నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. తెలంగాణ జెఎసి నాయకులు కోదండరామ్, శ్రీనివాస గౌడ్ ఎవరికీ చెప్పకుండా ఢిల్లీ వెళ్లి కాంగ్రెసు నాయకత్వాన్ని కలిశారని, దానిపై స్పష్టత కూడా ఇవ్వడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసి కూడా కాంగ్రెసు కనుసన్నల్లోనే నడుస్తోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications