25 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు జగన్ పార్టీలోకి?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడుతున్నవారిలో శాసనసభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిసిన మరుక్షణం మంత్రులు పి. విశ్వరూప్, వట్టి వసంతకుమార్, కాసు వెంకటకృష్ణా రెడ్డి తమ పార్టీలో చేరుతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుకుంటున్నారు.
పార్లమెంటు సభ్యుల్లో సాయి ప్రతాప్ (రాజంపేట), ఎస్పీవై రెడ్డి (నంద్యాల), అనంతవెంకట్రామిరెడ్డి (అనంతపురం) వైయస్సార్ కాంగ్రెసులో చేరుతారని వార్తలు వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే శాసనసభ్యుల్లో శిల్పా మోహన్ రెడ్డి (నంద్యాల), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), కాటసాని రాంభూపాల్ రెడ్డి (పాణ్యం), ఆదాల ప్రభాకర్ రెడ్డి (సర్వేపల్లి) ఉన్నట్లు చెబుతున్నారు.
తమకు గానీ, తమ పిల్లలకు టికెట్లు ఇస్తామనే హామీని పొంది వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు, ఆ విషయంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, వైయస్ జగన్ ఎవరికి కూడా టికెట్లు ఇస్తామనే గ్యారంటీ ఇవ్వడానికి సిద్ధంగా లేరని అంటున్నారు.
ప్రస్తుతం చంచల్‌గుడా జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ త్వరలోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యత్వం తీసుకోవచ్చునని అంటున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.












Click it and Unblock the Notifications