వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబును పిచ్చాస్పత్రిలో చేర్చాలి: అంబటి వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu and Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మానసికపరిస్థితి బాగోలేనందున పిచ్చాసుపత్రిలో చేర్పించాలని ఆయన అన్నారు. తాను సమైక్యవాదినని చెప్పుకుంటూ ప్రజలను గందరగోళ పరిస్థితులు నెడుతున్న చంద్రబాబు నాయుడు వెంటనే రాజీనామా చేయాలని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు.

రాజీనామా చేసి చంద్రబాబు ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి కాపాడిన చరిత్ర చంద్రబాబుది కాదా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని, గోడమీది పిల్లిల వ్యవహరిస్తున్న ఆయనకు ప్రజలు బుద్ది చెబుతారని ఆయన అన్నారు.

గతంలో కాంగ్రెసుకు సహకరించిన చంద్రబాబుది ద్వంద్వ వైఖరి అని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశానని గొప్పలు చెబుకుంటున్న చంద్రబాబు ప్రస్తుత పరిస్థితిపై ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అడిగారు.

మా పార్టీ వ్యతిరేమని చెప్పలేదు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమని తమ పార్టీ ఏనాడూ చెప్పలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రాష్ట్రానికి సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని మాత్రమే తమ పార్టీ అడుగుతోందని ఆనయ గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ ఉనికి కోల్పోతుందనే వార్తల్లో నిజం లేదని అన్నారు.

తమ పార్టీకి తెలంగాణలో బలం ఉందో, లేదో నిర్ణయించాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులకు లేదని ఆయన అన్నారు. తెరాస నేత హరీష్ రావు విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేసి తెరాస నేతలు రాక్షసానందం పొందుతున్నారని ఆయన అన్నారు.

English summary
YSR Congress leader Ambati Rambabu hs lashed out Telugudesam party president Nara Chandrababu Naidu on the bifurcation of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X