షిండే బర్త్‌డే-టి హీట్, చెక్కభజన శివతో అసద్ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: విభజన రాజకీయాలు ఢిల్లీని నిత్యం తాకుతూనే ఉన్నాయి. ఇరు ప్రాంతాల కాంగ్రెసు పార్టీ నేతలు హస్తినలో మకాం వేశారు. త్వరగా పార్లమెంటులో బిల్లు పెట్టేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రాంత నేతలు, విభజనపై యు టర్న్ తీసుకొని సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని సీమాంధ్ర నేతలు లాబీయింగ్ చేస్తున్నారు.
మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం రాత్రి వరకు పెద్దలతో జోరుగా చర్చలు జరిపారు. బిజీబిజీగా గడిపారు. పెద్దల ముందు మరోసారి సమైక్య గళం వినిపించారు. నాయకులు కేంద్రమంత్రులను కలుస్తూ తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు విభజనను వ్యతిరేకిస్తూ బుధవారం పార్లమెంటు వద్ద టిడిపి ఎంపీలు వినూత్న శైలిలో నిరసన తెలిపారు. లోక్‌సభ నుంచి సస్పెండ్ అయిన వారు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద చెక్క భజన చేస్తూ విభజనకు వ్యతిరేకంగా పాటలు పాడి నిరసన వ్యక్తం చేశారు. శివ ప్రసాద్ చిడతలు వాయిస్తూ గానం చేయగా, కొనకళ్ల నారాయణ రావు, నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలు తాళం వేస్తూ ఆయనకు వంత పాడారు.

షిండేతో సీమాంధ్ర నేతలు
కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే 73వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కెవిపి రామచంద్ర రావు, మంత్రులు వట్టి వసంత్ కుమార్, ఆనం రామనారాయణ రెడ్డిలు.

షిండేతో టి నేతలు
కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే 73వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న టి కాంగ్రెసు ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఆనంద భాస్కర్. అదే సమయంలో తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

షిండేతో నేతలు
కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాడ్గుల నాగఫణి శర్మ.

టిడిపి ఎంపీలు
రాష్ట్ర విభజనను నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలో చెక్క భజన చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు శివ ప్రసాద్, కొణకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నిమ్మల కిష్టప్పలు.

టిడిపి ఎంపీలు - అసద్
రాష్ట్ర విభజనను నిరసిస్తూ పార్లమెంటు ఆవరణనలో చెక్క భజన చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీల వద్ద మజ్లిస్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ.

జయాబచ్చన్‌తో చిరు
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పార్లమెంటు సభ్యురాలు జయాబచ్చన్‌తో మాట్లాడుతున్న దృశ్యం. పక్కనే మంత్రి సి రామచంద్రయ్య.

కిరణ్, డిగ్గీ సమక్షంలో సురేఖ..
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఎపి రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ల సమక్షంలో కాంగ్రెసు పార్టీలో చేరిన కొండా దంపతులు, ఇతరులు.












Click it and Unblock the Notifications