దినేష్ రెడ్డి ఆస్తులపై సిబిఐ విచారణకు సుప్రీం ఆదేశం

దినేష్ రెడ్డి సహా ఆయన సతీమణి కమలా రెడ్డికి చెందిన అన్ని ఆస్తుల లావాదేవీలతో పాటు డిజిపి కుటుంబ సభ్యులు వై. రవిప్రసాద్, ఎ కృష్ణారెడ్డి జరిపిన అన్ని లావాదేవీలపై పూర్తి విచారణకు ఆదేశించాలని కోరుతూ ఉమేష్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.
ఉమేష్ కుమార్ పిటిషన్‌లోని అభియోగాలను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు దినేష్ రెడ్డికి స్పష్టం చేసింది. దర్యాప్తులోని అభ్యంతరాలను ట్రయల్ కోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆయనకు సూచించింది. డిజిపి భార్య రంగారెడ్డి జిల్లా చంపాపేట, మహేశ్వరం, మేడ్చల్‌ల్లో 90 ఎకరాల భూములను విక్రయించడమూ కొనడమూ చేశారని ఉమేష్ కుమార్ ఫిర్యాదు ఆరోపించారు.
దినేష్ రెడ్డి తన భార్య పేరుతో బినామీగా ఆస్తులను కూడబెట్టారని ఉమేష్ కుమార్ ఆరోపించారు. కాగా, షూ కుంభకోణంలో ఉమేష్ కుమార్ నిందితుడిగా ఉన్నారని దినేష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications