జగన్ రిమాండ్ పొడిగింపు: కోర్టు వద్ద ధర్మానకు టి షాక్

ఓబుళాపురం మైనింగ్ కేసులో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, ఆయన అనుచరుడు అలీ ఖాన్ తదితరుల రిమాండును కూడా 20వ తేది వరకు పొడిగించారు. ఎమ్మార్ కేసు నిందితుల రిమాండును కూడా పొడిగించారు. వీరిని కోర్టు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించింది.
కోర్టుకు ధర్మాన, సబిత
జగన్ ఆస్తుల కేసులో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిలు శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. వీరితో పాటు జగన్ కేసులో ఉన్న నిత్యానంద రెడ్డి, శరత్ చంద్ర రెడ్డి, నిమ్మగడ్డ ప్రకాశ్, ఎమ్మార్ కేసులో బిపి ఆచార్య, కోనేరు ప్రసాద్, రాజగోపాల్, విజయ రాఘవలు కోర్టుకు వచ్చారు.
ధర్మానకు తెలంగాణ సెగ
సిబిఐ కోర్టులో ధర్మాన ప్రసాద రావుకు తెలంగాణ సెగ తగిలింది. పలువురు తెలంగాణ న్యాయవాదులు ధర్మానను అడ్డుకున్నారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications