లా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ కేసు: ఆరుగురికి జీవిత ఖైదు

ఈ కేసులోని ఎనిమిది నిందితుల్లో 24 ఏళ్ల రాజా పరారీలో ఉన్నాడు. ఎనిమిదో నిందితుడు మైనర్ కావడంతో బాలనేరస్థుల న్యాయస్థానం అతనిపై విచారణ జరుపుతోంది. ఆరుగురిని కేసులో దోషులుగా నిర్ధారించి సెషన్స్ న్యాయమూర్తి కృష్ణమూర్తి బి సంగనవార్ శిక్షను ఖరారు చేశారు.
ఈ కేసులో దోషులుగా తేలిన మద్దుర (20), దొడ్డీరయ్య (19), శివన్న (20), ఈరయ్య (20), ఎలయ్య (23), రామ (50) రామనగరం తాలూకా దాసేగౌడన గ్రామానికి చెందిన ఇరులిగ తెగకు చెందినవారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ 31 మంది సాక్షులను విచారించింది. విచారణ జూన్ 28వ తేదీన ప్రారంభమై ఆగస్టు 2వ తేదీన ముగిసింది.
కేసు విచారణలో 74 వస్తువులను, 79 పత్రాలను కోర్టుకు సమర్పించారు. పరీక్షలకు హాజరు కావాల్సి ఉండడంతో బాధితురాలికి కోర్టు ముందుకు రావడానికి 15 రోజుల సమయం ఇచ్చారు.












Click it and Unblock the Notifications