Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మేం తలుచుకుంటే వచ్చేవారా: సీమాంధ్ర స్టాఫ్‌పై హరీష్

హైదరాబాద్: ఎపి ఎన్జీవోలు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వచ్చిన సీమాంధ్ర ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. మెడ నరుకుతామంటూ, తల కోస్తామంటూ నినాదాలు చేస్తూ సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణవాళ్లను హైదరాబాదులో హెచ్చరిస్తున్నారని, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, తాము సహకరిస్తుంటే వారు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై దాడులు చేస్తున్నారని, దానికితోడు హైదరాబాదులో తెలంగాణ విద్యార్థి బాలరాజుపై సీమాంధ్ర ఉద్యోగులు శనివారం దాడి చేశారని ఆయన అన్నారు.

తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులపై ఆయన మండిపడ్డారు. 2004లో తాను తెలంగాణను అడ్డుకున్నానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారని, తెలంగాణను అడ్డుకునేవారిని విమర్శించడం తెలుగుదేశం తెలంగాణ నాయకులు విమర్శించడం లేదని ఆయన అన్నారు. తమ పార్టీని లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ స్పాన్సర్డ్ ఉద్యమమని ఎపి ఎన్జీవోల సభ ద్వారా మరోసారి తెలిసిపోయిందని ఆయన అన్నారు. ఎపిఎన్జీవోల సభకు కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు నాయకులు రైళ్లు, బస్సులు, వాహనాలు సమకూర్చారని ఆయన ఆరోపించారు.

Harish Rao

తాము ముఖ్యమంత్రి, డిజిపి నిరంకుశ వైఖరిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వ ద్వంద్వ నీతిని విమర్శిస్తున్నామని, సీమాంధ్ర ఉద్యోగులపై తమకు వ్యతిరేకత లేదని, వారిని సాదరంగా ఆహ్వానించి సాదరంగా పంపించాలని తాము పిలుపునిస్తున్నామని, తాము సభకు సహకరిస్తుంటే సీమాంధ్ర ఉద్యోగులు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సభకు వచ్చినవారికి భోజనాలు సమకూర్చారని ఆయన ఆరోపించారు. హైదరాబాదులో ఆశాంతి సృష్టించి, రెచ్చగొట్టి తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

తాము తలపెట్టిన బంద్ నూటికి నూరు శాతం విజయవంతమైందని ఆయన చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగులు రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని ఆయన తెలంగాణ ప్రజలను కోరారు. ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబుపై కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కోర్టును ధిక్కరించే విధంగా, చట్టాన్ని అతిక్రమించే విధంగా అశోక్ బాబు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. నిజాం కాలేజీ వద్ద సమైక్యనినాదాలు చేసి రెచ్చగొట్టారని ఆయన అన్నారు. ప్రేమించకపోతే యాసిడ్ దాడి చేస్తామనే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఉద్యోగులకు మాత్రమే అనుమతిస్తామని చెప్పిన పోలీసులు దొంగ పాసులతో వస్తున్నవారిని అడ్డుకోవడం లేదని ఆయన అన్నారు. దొంగ పాసులపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

తమ ప్రాంతంలో ఆత్మహత్యలు ఉండవు, హత్యలే ఉంటాయని అశోక్ భాబు అంటున్నారని, అశోక్ బాబు మాటాల్లోని ఆంతర్యమేమిటని ఆయన అన్నారు. అశోక్ బాబు ఏం సంకేతాలు పంపదలుచుకున్నారని ఆయన అన్నారు. హైదరాబాదులో హింస చెలరేగాలని సీమాంధ్రులు కోరుకుంటున్నారని, తాము తలుచుకుంటే హైదరాబాదుకు సీమాంధ్ర ఉద్యోగులు వచ్చి ఉండేవారు కాదని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+