కర్నూలు త్యాగమే హైదరాబాద్ అభివృద్ధి: చంద్రశేఖర్

Save Andhra Pradesh meeting
హైదరాబాద్: కర్నూలు ప్రజల త్యాగం ఫలితంగానే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఆర్టీసి నేత చంద్రశేఖర్ అన్నారు. ఎపిఎన్జీవోల సంఘం నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో ఆయన శనివారం మాట్లాడారు. సీమాంధ్రలో విశాఖ ఉక్కు కర్మాగారం తప్ప మరే భారీ పరిశ్రమ రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది బతుకు దెరువు సమస్య అని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు బళ్లారిని కోల్పోయి అపార సంపదను, తుంగభద్ర నదీజలాలను నష్టపోయామని ఆయన చెప్పారు. ఈ స్థితిలో హైదరాబాద్ మాది కాకుండా పోతే ఏమవుతామనే ఆందోళన నెలకొందని ఆయన అన్నారు. ఏ ప్రాంతానికీ వ్యతిరేకంగా తాము ఉద్యమం చేయడం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే కరువు ప్రాంతాలు ఎడారిగా మారిపోతాయని ఆయన అన్నారు. రాయలసీమ, దక్షిణ తెలంగాణ, ఉత్తరాంధ్రలో మిగులు జలాలపై ఆధారపడి ప్రాజెక్టులు నిర్మితమయ్యాయని, విభజన జరిగితే ఆ ప్రాజెక్టులకు నీరు అందదని ఆయన అన్నారు. విభజన జరిగితే 13 జిల్లాల్లో ఆర్టీసి మూత పడుతుందని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజన జరిగితే రాష్ట్రం ఎడారిగా మారే ప్రమాదం ఉంది కాబట్టే ప్రజలు ఆందోళన చేస్తున్నారని ఆయన చెప్పారు. సమైక్యంగా ఉండడం తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు. నీటి సమస్య, అభివృద్ధి సమస్య ఉన్నాయని, అవి పరిష్కారం కావాలని, వాటి గురించి తెలంగాణ మేధావులు, ప్రజలు ఆలోచించాలని ఆయన అన్నారు. సమస్యలపై తెలంగాణ ప్రజలు ఆలోచించాలని, విద్వేషాలకు వెళ్లకూడదని ఆయన కోరారు.

రాజకీయ నేతల తీరును ప్రముఖ సామాజిక కార్యకర్త మిత్రా తప్పు పట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనని ఆయన అన్నారు. తమకు ఒక్కటే ఆంధ్రప్రదేశ్, ఒక్కటే హైదరాబాద్ ఉందని ఆయన అన్నారు. అవి అలాగే ఉంటాయని ఆయన అన్నారు. విభజనకు లేఖలు ఇచ్చి తప్పు చేశారని, ఇప్పటికైనా మేల్కోవాలని ఆయన అన్నారు. రాజకీయ నాయకులు ప్రజల వైపు నిలబడాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+