భార్యతో ఎమ్మెల్యే ధర్నా: బలమన్న పయ్యావుల

తెలంగాణలో 50 శాతం సమైక్యవాదులు ఉన్నారని, వారిని ఈ సభకు రానివ్వకుండా చేసేందుకే తెలంగాణలో బంద్ ప్రకటించారని విమర్శించారు. టెన్ జనపథ్ డైరెక్షన్లలోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి లేఖ రాశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కారుకు డీజిల్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఫ్యాన్‌కు కరెంట్‌ను ఇస్తుంది కాంగ్రెస్సే అని ఆయన అన్నారు. తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నేతలు ఢిల్లీ పెద్దల చేతుల్లో కీలు బొమ్మలని పయ్యావులు అన్నారు.
అసెంబ్లీ గేటు వద్ద ప్రొద్దుటూరు ఎమ్మెల్యే లింగారెడ్డి శనివారం ఆందోళనకు దిగారు. భార్యతో కలిసి అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు యత్నించిన ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో లింగారెడ్డి అసెంబ్లీ వద్ద ధర్నాకు దిగారు.
ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి వెళ్లే హక్కు తనకుందని ఎమ్మెల్యే లింగారెడ్డి అన్నారు. అసెంబ్లీలోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటే సభా హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని, దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే లింగారెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications