జమ్మూకాశ్మీర్ లో కాల్పులు: ముగ్గురు మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో సీఆర్పీఎఫ్ క్యాంపుపై తీవ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. షోపియాన్‌లోని గాగ్రన్ వద్ద ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంపుపై తీవ్రవాదులు కాల్పులకు దిగడంతో పోలీసు బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పులలో ముగ్గురు మిలిటెంట్లు మృతి చెందినట్లు సమాచారం.
పోలీస్ అధికారి చెప్పిన వివరాల ప్రకారం షోపియాన్‌లోని గాగ్రన్ దగ్గర మధ్యాహ్నం ఒంటి గంటకు కాల్పులు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ముగ్గురు వ్యక్తులు కాల్పుల్లో మృతి చెందినట్లు తెలిపారు. వారి దగ్గర నుంచి పలు ఆయుధానాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే శనివారం సాయంత్రం జుబిస్ మెహతా కచేరికి వ్యతిరేకంగా వేర్పాటువాదులు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందె.

తుండాకు 4రోజుల కస్టడీ
ఢిల్లీ: లష్కరే తొయిబా సంస్థకు చెందిన తీవ్రవాది అబ్దుల్ కరీం తుండాకు నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధిస్తూ ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం శనివారం ఆదేశాలు జారీ చేసింది. వివిధ బాంబు పేలుళ్ల కేసులలో ప్రధాన నిందితుడైన తుండాను చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అమిత్ బన్సాల్ ఎదుట పోలీసులు హాజరు పర్చారు.
పలు బాంబు పేలుళ్లో ముఖ్య పాత్ర పోషించిన తుండాను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరినప్పటికీ నాలుగు రోజుల కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తుండాను బీహార్-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విధితమే.












Click it and Unblock the Notifications