సీట్లకు కక్కుర్తిపడొద్దు: బాబు, జగన్‌పార్టీలో చేరరా: సిఎం

యూపిఏది తుగ్లక్ పాలన అన్నారు. పంచాయతీ ఎన్నికలలో టిడిపి ప్రభంజనం చూసిన కాంగ్రెసు కుట్ర రాజకీయాలకు తెరలేపిందని ఆరోపించారు. చిత్తశుద్ధి లేని పరిష్కారం వల్ల కొత్త సమస్యలు సృష్టించారన్నారు. తెలుగు జాతి మధ్య అగ్గి రాజేశారని మండిపడ్డారు. అసలు దోషి కాంగ్రెస్ అని, దానిని చిత్తుచిత్తుగా ఓడిస్తే సమస్య పరిష్కారమవుతుందన్నారు. కాగా, సీమాంధ్ర బస్సులపై రాళ్ల దాడిని చంద్రబాబు ఖండించారు.
రావణకాష్టంలా..: నారాయణ
రాష్ట్రం ప్రస్తుతం రావణకాష్టంలా మారిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. సచివాలయం స్మశానంలా మారిందని, దీనికి ప్రభుత్వమే కారణమన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు లోపలో మాట ప్రజల్లో మరో మాట చెబుతున్నాయన్నారు. నేతలు బస్సు యాత్రల పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగం: రాష్ట్ర రాజధాని హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమని టిజెఏసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఊరుకునేది లేదన్నారు. హైటెక్ సిటీ అభివృద్ధిలో తెలంగాణ ప్రాంతం వారికి స్థానం లేకుండా పోయిందన్నారు.
జగన్ పార్టీలో చేరరా?: టిజికి సిఎం రమేష్
మంత్రి టిజి వెంకటేష్ తన మనసును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన పెట్టుకొని కాంగ్రెసుతో ఉంటున్నారని టిడిపి ఎంపీ సిఎం రమేష్ అన్నారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం లేదని ఆయన చెప్పగలరా అన్నారు. ఓ వైపు సమైక్య ఉద్యమం జరుగుతుంటే అమెరికాలో ఉన్న ఆయన ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడటం విడ్డూరమన్నారు.
వారు తోడు దొంగలు: వివేక్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డిలు తోడు దొంగలు అని ఎంపి వివేక్ కరీంనగర్ జిల్లాలో అన్నారు. ఎపిన్జీవోల సభకు అనుమతిచ్చి, తెలంగాణ ప్రాంత ప్రజల శాంతి ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభలో పోలీసుల తీరును ఆయన తప్పు పట్టారు.
త్వరలో తెలంగాణ నోట్: గీతా రెడ్డి
త్వరలో తెలంగాణపై కేబినెట్ నోట్ తయారవుతుందని మంత్రి గీతా రెడ్డి మెదక్ జిల్లాలో చెప్పారు. ఎపిఎన్జీవోల సభ విజయవంతం కావడానికి తెలంగాణవాదులు శాంతియుతంగా ఉండటమే కారణమన్నారు.












Click it and Unblock the Notifications