లోకేష్‌కోసం హరికి బాబు ద్రోహం: షర్మిల(టూర్ పిక్చర్స్)
కడప: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకునేదాకా తరిమితరిమి కొట్టాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల శనివారం ప్రజలకు పిలుపునిచ్చారు. ఆమె సమైక్య శంఖారావం కడప జిల్లాలో సాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పటికీ అవే రాజకీయాలు నడుపుతూ తన కుమారుడు నారా లోకేష్‌ను అందలం ఎక్కించుకునేందుకు హరికృష్ణ కుటుంబానికి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు హైదరాబాద్‌ను ఏంచేశారో అందరికీ తెలుసన్నారు. చార్మినార్ ఏమైనా కట్టించారా? వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను బినామీలకు అప్పగించారని ఆరోపించారు. తెలంగాణకు మద్దతుగా కేంద్రానికి లేఖ ఇచ్చిన ఆయన ప్రస్తుతం తెలంగాణవాదులకు వెన్నుపోటు పొడిచి సమైక్యాంధ్రులను మోసం చేసేందుకు సీమాంధ్రలో ఆత్మగౌరవయాత్ర చేపట్టారని, ఇంతకు మించిన ద్రోహం ఏముంటుందని తెలిపారు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తన తనయుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకే తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని ఆరోపించారు. జగనన్న నాయకత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తామని, తెప్పించాలని, ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ అడ్డగించలేరని, అలాగే జగన్ ప్రభంజనాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని తెలిపారు. చంద్రబాబు మద్దతుతోనే విభజన జరిగిందన్నారు.

జన సందోహం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం యాత్రకు భారీగా తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులు.

అభివాదం
తాను చేపట్టిన సమైక్య శంఖారావంలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులకు అభివాదం చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల.

మాట్లాడుతున్న షర్మిల
తాను చేపట్టిన సమైక్య శంఖారావంలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులను ఉద్దేశించి మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల.

కర్నూలులో..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం యాత్రకు కర్నూలులో భారీగా తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులు.

మాట్లాడుతున్న షర్మిల
తాను చేపట్టిన సమైక్య శంఖారావంలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులను ఉద్దేశించి మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల.

శంఖారావం
తాను చేపట్టిన సమైక్య శంఖారావంలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులకు అభివాదం చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications