బాబుదే పాపం, హైద్రాబాద్‌నే చూశాడు: విభజనపై టిజి

తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటామని తెలుగుదేశం పార్టీ చెప్పి ఉంటే తాము కేంద్రాన్ని నిలువరించే వారిమన్నారు. పార్టీ అధినాయకులు విభజనకు అనుకూలంగా ఉన్నా పార్టీ నాయకులు మాత్రం వ్యతిరేకిస్తున్నారన్నారు. తమతో కలిసి సమైక్య ఉద్యమంలో పాల్గొనేందుకు పలు పార్టీల నాయకులు వస్తున్నారన్నారు.
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆయా పార్టీల నాయకులు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారన్నారు. ప్రతిపక్షాలు అనుకూలంగా ఇవ్వకుంటే విభజనను అడ్డుకునే శక్తి తమకు ఉందన్నారు. శాసన సభలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించాక తాము రాజీనామాలు చేసే విషయమై ఆలోచిస్తామన్నారు. రాజీనామాలకు వెనక్కి పోవడం లేదన్నారు.
శాసన సభలో తీర్మానం వీగినా తెలంగాణపై ముందుకు వెళ్తారని ప్రచారం సాగుతోందని, ఇది ఎంత వరకు న్యాయమని రాజ్యాంగ నిపుణులు ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో చాలామంది సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారన్నారు. అందరు భయాందోళనతో బతుకుతున్నారని చెప్పారు. సమైక్య రాష్ట్ర కోసం సీమ ప్రాంతం రాజధానిని పోగొట్టుకుందన్నారు. శాసన సభ రద్దు చేస్తే బిల్లు పెట్టే ప్రసక్తి రాదన్నారు.
చంద్రబాబు హైదరాబాదునే కాకుండా మిగతా ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఎపిఎన్జీవోల సభలో కానిస్టేబుల్ పైన దాడి విషయంపై స్పందిస్తూ.. లక్ష మంది వచ్చి తమ గళం వినిపిస్తున్న చోట ఓ వ్యక్తి మాట్లాడటం ఎంత వరకు సమంజసమని, వారు ఎమోషనల్‌లో వారించారని చెప్పారు.












Click it and Unblock the Notifications