విప్ జారీ చేసినా తగ్గం: గంటా, వైయస్ విగ్రహానికి నిప్పు

విభజను నిరసిస్తూ...
రాష్ట్ర విభజనను నిరసిస్తూ పశ్చిమ గోదావరి ఉండి ఎమ్మెల్యే వెంకట శివరామరాజు పంట కాలువలో వల వేసి చేపలు పట్టారు. ఉండి మెయిల్ రోడ్డులోని జాతీయ రహదారిని చేపల వలతో దిగ్బంధించారు. అనంతరం ఎమ్మెల్యే మత్స్యకారుడి వేషధారణలో వల విసిరి, చేపలు పట్టారు. రాష్ట్ర విభజన జరిగితే నదీ జలాలు ఎండిపోయి అక్వా రైతుతో పాటు మత్స్యకారులు కూడా చేపలు దొరకక ఇబ్బందులు పడతారన్నారు.
ఢిల్లీలో రిలే దీక్షలు
ఢిల్లీలో సమైక్యాంధ్ర జెఏసి ఆధ్వర్యంలో ఎపి భవన్‌లో రిలే దీక్షలు చేపట్టారు. ఎపి భవన్ ఉద్యోగులు, సమైక్యవాదులు పాల్గొన్నారు.
సభకు సీమాంధ్ర న్యాయవాదుల ఆలోచన
హైదరాబాదులోని సుందరయ్య కళా భవన్‌లో సీమాంధ్ర న్యాయవాదులు భేటీ అయ్యారు. త్వరలో సమైక్యాంధ్ర న్యాయవాదుల సభను నిర్వహించాలనే యోచనలో ఉన్నారు.
వైయస్ విగ్రహానికి నిప్పు
తెలంగాణ బంద్ సందర్భంగా శనివారం వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నిప్పు పెట్టారు. విగ్రహం మెడలో ఆటో టైరు ఉంచి నిప్పు పెట్టడంతో తల భాగం పూర్తిగా మసిబారిపోయింది. ఈ ఘటనకు సంబంధించి పలువురిపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications