ముజఫర్‌నగర్‌లో అల్లర్లు: 27 మంది దుర్మరణం

కొత్వాలి, కొత్త మండీల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి కొంత సమయం పడుతుందని, సైన్యంతోపాటు భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించామని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అవసరమైతేనే కాల్పులు జరపాలని ఆదేశించినట్లు అదనపు జీడీపీ అరుణ్‌కుమార్ తెలిపారు.
ముజఫర్‌నగర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో మతపరంగా సున్నితమైన మీరట్ జిల్లాలో ముందు జాగ్రత్త చర్యగా అన్ని విద్యాసంస్థలను మూసేయాలని అధికారులు ఆదేశించారు. హింసాత్మక పరిణామాలపై దర్యాప్తుకు ఆదేశించినట్లు ఎస్పీ నేత రామ్ ఆశ్రయ్ తెలిపారు. శాంతిభద్రతల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, సీఎం అఖిలేష్ రాజీనామా చేయాలని బీజేపీ, బీఎస్పీ డిమాండ్ చేశాయి. అఖిలేష్ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి బర్తరఫ్ చేయాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది.
కాగా, ముజఫర్ నగర్‌లో చెలరేగిన హింసపై ఉత్తరప్రదేశ్ గవర్నర్ బిఎల్ జోషీ కేంద్రానికి నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో శాంతిని పరిరక్షించడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని ఆయన కేంద్రానికి సమర్పించిన నివేదికలో విమర్శించినట్లు సమాచరాం. ఎస్పీ అధినేత ములాయం సింగ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తోనూ ఉన్నతాధికారులతోనూ సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications