బొత్స క్యాంప్ ఆఫీస్‌పై దాడి: హైకోర్టు వద్ద ఉద్రిక్తత

హైదరాబాదులోని హైకోర్టు వద్ద బుధవారం ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. సీమాంధ్ర, తెలంగాణ పోటాపోటీ ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించేందకు యత్నిస్తుండంతో భారీగా పోలీసులను మోహరించారు. హైకోర్టు వద్ద ఆందోళనలు, ర్యాలీలను పోలీసులు నిషేధించారు. హైకోర్టు బయట ఆందోళనలకు అనుమతి తీసుకోవాల్సిందేనని పోలీసులు తేల్చి చెప్పారు. హైకోర్టు పరిసరాల్లో 144 సెక్షన్‌ను విధించారు.
మదీనా సెంటర్ నుంచి సిటీ కాలేజి వరకు రోడ్డుకు ఇరువైపుల ఉన్న దుకాణాలను మూసివేశారు. హైకోర్టు దగ్గర ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా నేడు చేపట్టదలచిన మానవహారాన్ని సీమాంధ్ర లాయర్లు విరమించుకున్నారు. ఛలో హైకోర్టుకు బయలు దేరిన తెలంగాణ న్యాయవాదులను మదీనా సెంటర్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు.
హైకోర్టు వద్ద పరిస్థితిని అదనపు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సమీక్షించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. హైకోర్టు 6,7 గేట్ల వద్ద పెద్ద యెత్తున పోలీసులు మోహరించారు. మీడియా ప్రతినిధుల సమావేశాలకు కూడా ముందుగా అనుమతి తీసుకోవాలని పోలీసులు ఆదేశించారు.












Click it and Unblock the Notifications