జగన్ బెయిల్‌కి డీల్, వారి ఫోన్స్ ట్యాప్ చేస్తే: యనమల

Yanamala Ramakrishnudu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇప్పించేందుకు ఆ పార్టీ కాంగ్రెసు పార్టీతో ఒప్పందం కుదుర్చుకుందని, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఫోన్‌ను ట్యాప్ చేస్తే కాంగ్రెసు - వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య గుట్టు తెలిసిపోతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మంగళవారం అన్నారు.

రోజుకో నిర్ణయం, రోజుకో మాట వినిపిస్తూ జగన్ పార్టీ ఊసరవెల్లిలా మారిందని, వైయస్ సమాధి సాక్షిగా తెలంగాణాకు అనుకూలం అని, తర్వాత పార్లమెంటులో సమైకాంధ్ర ప్లకార్డులు పట్టుకుని జగన్ తన నిర్ణయాన్ని తానే మార్చుకున్నాడని అన్నారు. ఆ తర్వాత సమన్యాయం అని, మళ్లీ సమైక్యాంధ్ర అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, ఇది ఆ పార్టీ అవకాశ వాదం అని అన్నారు.

పైగా ఆ పార్టీ రాష్ట్రపతికి, ప్రధానికి, హోంమంత్రికి లేఖలు రాస్తూ తానెంత బలహీనంగా ఉన్నానో చెప్పకనే చెబుతోందన్నారు. నిత్యం తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును దూషిస్తున్న షర్మిల ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. విజయమ్మ, భారతీ, షర్మిల ఫోన్లు టాప్ చేస్తే కుట్ర అర్థమవుతుందన్నారు.

జగన్‌ను జైలు నుండి బయటకు తెచ్చుకునేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసు పార్టీతో డీల్ కుదుర్చుకుందని ఆరోపించారు. తాము భవిష్యత్తులో ఎప్పటికీ కాంగ్రెసు పార్టీతో కలవమని ఆ పార్టీ నేతలు ప్రమాణం చేయగలరా అని యనమల ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+