సోనియా స్క్రిప్ట్‌లో వారు: బాబు 'జస్టిస్ చౌదరి'(పిక్చర్స్)
హైదరాబాద్: అవినీతిపరులను, అక్రమార్కులను, అవకాశవాదులను ఓడించేందుకు ప్రజలు జస్టిస్ చౌదరీలా మారాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చంద్రబాబు తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. ఈ రోజుతో మొదటి విడత యాత్ర ముగియనుంది. అనంతరం ఆయన హైదరాబాదుకు వస్తారు.
యాత్రలో ఆయన కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిల పైన నిప్పులు చెరిగారు. మంచివాళ్లనే గెలిపించాలని కోరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తల్లి కాంగ్రెసు గూటికే ఎప్పటికైనా చేరుతుందని, దొంగలకు రాజ్యాధికారం ఇవ్వవద్దన్నారు. తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ స్క్రిప్ట్‌లో భాగమన్నారు.
తెలుగువాడి దెబ్బ ఆ పార్టీలకు రుచి చూపిద్దామన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి లక్ష కోట్లు దోచి కొడుక్కు ఇచ్చాడని, వైయస్ చనిపోయిన తర్వాత సిబిఐ జగన్‌ను ముద్దాయిగా పెట్టిందన్నారు. సిబిఐ ప్రధానమంత్రి ఆధీనంలో ఉందని, వైయస్ అప్పట్లో ప్రధానికి కప్పం కట్టే వారని విమర్శించారు.

మాట్లాడుతున్న బాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. ఆయన మాట్లాడుతున్న దృశ్యం.

మాట్లాడుతున్న బాబు 2
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న చంద్రబాబు.

బాబు యాత్రలో మహిళా కార్యకర్తలు
కృష్ణా జిల్లా విజయవాడలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్రకు వచ్చిన మహిళా కార్యకర్తలు.

పసుపుమయం
కృష్ణా జిల్లా విజయవాడలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర పసుపుమయమైన దృశ్యం.












Click it and Unblock the Notifications