జగన్ ప్రపంచ రికార్డు, షర్మిలకెలా తెలుసు: యనమల

Yanamala Ramakrishnudu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ కేసులో దాఖలైన చార్జిషీట్ల నుంచి మంత్రులను తొలగించడం దేనికి సంకేతమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు ప్రశ్నించారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. ఈ అంశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. మంగళవారంనాడు చార్జిషీటు దాఖలైన సిమెంట్ కంపెనీల యజమానులను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

వైయస్ జగన్ ఓ 420 - వైసీపీ ఓ 420 పార్టీ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్కో చార్జిషీటును విడిగా విచారిస్తే జగన్ అవినీతి బయటపడుతుందని వారన్నారు. అవినీతి కుంభకోణాలు, చార్జిషీట్ల అభియోగాల్లో వైయస్ జగన్ ప్రపంచ రికార్డు సాధించాడని యనమల వ్యాఖ్యానించారు.

జగన్‌పై దాఖలైన చార్జిషీట్లు ప్రపంచంలో మరే రాజకీయ నాయకుడి మీద కూడా దాఖలైన చరిత్ర లేదని అన్నారు. దోపిడీ విధానం, మోసమే లక్ష్యంగా పనిచేసే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పేదలకు ఎలాంటి సామాజిక న్యాయం చేస్తుందని ఆయన అడిగారు.

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లాలూచీకి వైయస్ జగన్ సోదరి షర్మిల వ్యాఖ్యలే నిదర్శనమని ఆయన అన్నారు. జగన్‌కు బెయిల్ వస్తుందని ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆ విధంగా అన్నారు. జగన్‌కు బెయిల్ వస్తుందని షర్మిలకు ఎలా తెలుసునని ఆయన అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+