కిరణ్ లీకు వీరుడు, ఎప్పటికీ జైల్లోనే జగన్: బాబు

మరో నాయకుడు ఎప్పుడూ జైల్లోనే ఉంటాడని ఆయన వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఈ ముగ్గురి వల్ల ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర కోసం 42 రోజులుగా ఉద్యమిస్తున్నా సీమాంద్రులను పట్టించుకునే నాథుడే లేడని ఆయన విమర్శించారు. సీమాం«ద్రుల హక్కుల కోసం పోరాడుతామని ఆయన చెప్పారు.
అన్ని రాజకీయపార్టీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాయని ఆయన చెప్పారు.. సమస్య పరిష్కారం చేయమంటే కాంగ్రెస్ మరిన్ని సమస్యలను సృష్టిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతోందని చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం ఉదయం కృష్ణా జిల్లా గాదెవారిపేటలో చంద్రబాబు 11వ రోజు తన ఆత్మగౌరవయాత్రను కొనసాగించారు.
మన్మోహన్ ఓ అసమర్థ ప్రధాని అని, సోనియా చేతిలో ప్రధాని రిమోట్ కంట్రోల్ లాంటివారని ఆయన విమర్శించారు. దేశానికి, రాష్ట్రానికి సరైన నాయకత్వం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమ పార్టీ హయాంలో గ్రామగ్రామాన నాయకుడు పుట్టుకొస్తాడని బాబు తెలిపారు.












Click it and Unblock the Notifications