మిసెస్ ఇండియా 2019 పోటీలో మెరిసిన ఆదిలాబాద్ గృహిణి
ఆదిలాబాద్ : మహిళలంటే వంటింటికే పరిమితం కాదని నిరూపిస్తున్నారు. అన్నిరంగాల్లో సత్తా చాటుతూ ముందుకెళుతున్నారు. ఆ క్రమంలో ఆదిలాబాద్ టౌన్‌కు చెందిన వర్ష శర్మ మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొని రన్నర్ అప్‌గా నిలిచారు. ఈ నెల 2వ తేదీన ప్రముఖ కాస్మొటిక్స్ కంపెనీ పనాషే ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో వర్ష శర్మ తన ప్రతిభను చాటారు.
35 మందితో పోటీపడ్డ వర్ష శర్మ రన్నర్ అప్‌గా నిలిచారు. ఆ క్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆమెను అభినందించారు. శాలువాతో సన్మానించి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా నుంచి మిసెస్ ఇండియా పోటీలో పాల్గొని రన్నరప్‌గా నిలవడం జిల్లాకు గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఇంకా అనేక పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయిలో రాణించాలని.. తద్వారా జిల్లా ఖ్యాతి పెంచాలని ఆకాంక్షించారు.

మహిళలు ఇంటికే పరిమితం కావొద్దని కోరారు మిసెస్ ఇండియా రన్నర్ అప్‌గా నిలిచిన వర్ష శర్మ. మహిళలు తలుచుకుంటే ఏ రంగంలోనైనా రాణించొచ్చని తెలిపారు. ప్రయత్నిస్తే ఎందులోనైనా విజయం లభిస్తుందని చెప్పారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications