తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బోధ్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బోధ్ ఒకటి. 1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్‌డ్. ఇది అదిలాబాద్ జిల్లాలో ఉంది. మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిసి ఇది అదిలాబాద్ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఉంది. 1962 నుంచి 1983 వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది. ఆ తర్వాత నుంచి వరుసగా టీడీపీ గెలుస్తూ వచ్చింది. టీఆర్ఎస్ వచ్చాక ఆ పార్టీ గెలుస్తోంది. 1985 నుంచి 1999 వరకు టీడీపీ అభ్యర్థులు గెలిచారు. 2004లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 2009లో తిరిగి తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపూరావు సమీప అభ్యర్థి, కాంగ్రెస్ నేత జాదవ్ పైన విజయం సాధించారు. రాథోడ్ బాపూరావుకు 62,870 ఓట్లు రాగా, జాదవ్ అనిల్ కుమార్‌కు 35,877 ఓట్లు వచ్చాయి. 26,993 ఓట్ల ఆధిక్యంతో బాపూరావు గెలిచారు.













Click it and Unblock the Notifications