ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు: 22 మంది మృతి

కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో స్వల్పంగా కేసులు తగ్గాయి. 80,641 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,068 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. నిన్న 2107 కరోనా కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. నిన్నటికన్నా ఇవాళ స్వల్పంగా కేసులు తగ్గాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 337 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 315, కృష్ణా జిల్లాలో 251, ప్రకాశం జిల్లాలో 207, నెల్లూరు జిల్లాలో 205 కేసులు వెల్లడయ్యాయి.

అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 18 కేసులు గుర్తించారు. 2,127 మంది కరోనా నుంచి కోలుకోగా, 22 మంది మరణించారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఆరుగురు మృత్యువాతపడ్డారు.రాష్ట్రంలో ఇప్పటివరకు 19,64,117 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,29,565 మంది కోలుకున్నారు. ఇంకా 21,198 మంది చికిత్స పొందుతున్నారు. 22 మందితో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,354కి పెరిగింది.

2068 people infected corona in andhra pradesh

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.

రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+