Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో 24 గంటలు పవర్ సప్లై.. 50 శాతానికి విద్యుత్ ఛార్జీలు ఉండవు: ఇంధనశాఖ కార్యదర్శి

అసలే వేసవి.. ఆపై విద్యుత్ వినియోగం హై.. దీంతో విద్యుత్ కొరత సహాజమే.. తెలంగాణలో అయితే ఆల్ టైం హైకి డిమాండ్ చేరింది. ఏపీలో కూడా అదే పరిస్థితి. అయితే విద్యుత్ కోతలు అని ప్రతిపక్షాలు గగ్గొలు పెడుతున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ సరఫరా కోసం ఏపీఈఆర్సీ విద్యుత్ టారిఫ్ విడుదల చేసిందని ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ తెలిపారు. విజయవాడ ఆర్ అండ్ బి కార్యాలయం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్‌లో ముందు ముందు విద్యుత్ డిమాండ్ బాగా పెరగనుందని.. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రజల నుంచి విజ్ఞప్తి స్వీకరించిన తరువాత 2022-23 నూతన విద్యుత్ టారిఫ్ ఆమోదించిందన్నారు.

 50 శాతానికి నో..

50 శాతానికి నో..


విద్యుత్ వినియోగంలో 50 శాతం జనాభా 75 యూనిట్ల లోపు టారిఫ్‌లోకి వస్తారని, 50 శాతం మంది ప్రజలకు స్వల్పంగా విద్యుత్ చార్జీలు పెరుగుతాయని అన్నారు. ప్రజల కోరిక మేరకు టెలిస్కోపింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించార. దీంతో విద్యుత్ చార్జీలు వలన ప్రజలపై పడే భారం స్వల్పమే అవుతుందని చెప్పారు. 0-30 యూనిట్ల విద్యుత్ చార్జీల పెంపు స్వల్పంగా ఉంటుందని చెప్పారు. ప్రజల కోరిక మేరకే ఈ స్లాబ్ లను ఏపీఈఆర్సీ అమల్లోకి తీసుకొచ్చిందని వివరించారు. 2 వేల 100 కోట్లు ట్రూ అప్ ఛార్జీలుగా వసూలు చేస్తున్నామని, మూడేళ్ళ పాటు ట్రూ అప్ చార్జీలు వసూలు చేయడానికి ఏపీఈఆర్సీ అనుమతి ఇచ్చిందన్నారు. 2022-23 సంవత్సరానికి ట్రూ అప్ చార్జీలు క్రింద 700 కోట్లు, విద్యుత్ చార్జీలు పెరుగుదల రూ. 1400 కోట్లు కలిపి రూ. 2100 కోట్లు మాత్రమే వసూలు చేస్తున్నామన్నారు.

మాకు సంబంధం లేదు

మాకు సంబంధం లేదు


విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిది కాదని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్ దే అన్నారు. 45 వేల కోట్లు ఖర్చు ఉందని వాటిలో 11 వేల 123 కోట్లు లోటు అని ఈ 11 వేల 123 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఉచిత విద్యుత్ కు రూ. 4511 కోట్లు కాగా, డొమెస్టిక్ కు రూ.
4,037 కోట్లు సబ్సిడీ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. సింగల్ టారిఫ్ టెలిస్కోప్ విధానం ద్వారా స్లాబ్ ను ప్రవేశపెట్టామన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో బొగ్గు గనులు లేవని ఒరిస్సా, తెలంగాణా రాష్ట్రాలపై ఆధార పడి బొగ్గు కొనుగోలు చేస్తున్నామని.. బొగ్గు రేట్లు పెరుగుదల రవాణా చార్జీలు పెరగడం డీజిల్ ఇతరాల పెరుగుదల కారణంగా ఏడాదికి 14 శాతం ఉత్పత్తి వ్యయం పెరుగుతుందన్నారు.

 74 శాతం ఇక్కడే

74 శాతం ఇక్కడే


రాష్ట్రంలో 74 శాతం విద్యుత్ ధర్మల్ ద్వారా విద్యుత్ ఉత్పాదన జరుగుతుందన్నారు. రాష్ట్రంలో నిన్న 230 మిలియన్ యూనిట్లు డిమాండ్ కాగా, 180 నుండి 190 మిలియన్ల పీపీఏలు అందుబాటులో ఉన్నాయన్నారు. తెలంగాణలో రూ. 5600 కోట్లు విద్యుత్ చార్జీలు పెంచగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కేవలం రూ. 1400 కోట్ల మేరకు మాత్రమే విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. పీపీఏలను రద్దు చేయలేదని ధరలను సమీక్షించమని ప్రభుత్వం ఆయా కంపెనీలను కోరిందన్నారు. రైతులకు అందించే ఉచిత విద్యుత్ సరఫరా కోసమే సెకి నుండి కొనుగోలు చేసిన విద్యుత్‌ను వినియోగిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వలన మొత్తం విద్యుత్ రంగ అప్పులు రూ. 85 వేల కోట్లకు చేరిందని, ఈ ప్రభుత్వం రూ. 35 వేలకోట్లు విద్యుత్ కు సంబంధించి వివిధ సంస్థలకు అందించిందన్నారు.

స్వల్పమే..

స్వల్పమే..


నూతన టారిఫ్ విధానం వలన విద్యుత్ చార్జీలు స్వల్పంగా పెరిగాయన్నారు. 250 యూనిట్లు విద్యుత్ వాడే వినియోగదారుడు మొదటి 30 యూనిట్లు వరకు యూనిట్ కు రూ. 1-90 పైసలు, 31 నుండి 75 యూనిట్ల వరకు రూ. 3 లు, 125 యూనిట్ల వరకూ రూ. 4-50 పైసలు, 76 నుండి 225 యూనిట్ల వరకు రూ. 6-00 లు, 226 నుండి 400 యూనిట్ల వరకూ రూ. 8-75 పైసలు, ఆ పైబడి రూ. 9-75 పైసలుగా విద్యుత్ చార్జీలను ఏ పి ఇ ఆర్ సి నిర్ణయించిందన్నారు. విద్యుత్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని, 2022-23 సంవత్సరానికిగాను విద్యుత్ చార్జీలు స్వల్పంగా పెంచామని, పెంచిన విద్యుత్ చార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని అన్నారు. 2022-23 టారిఫ్ వివరాలను తెలియజేశారు. వేసవి వల్ల డిమాండ్ పెరిగిందని.. అందుకే 230 మిలియన్ యూనిట్లు వినియోగం అవుతుందన్నారు. సాధారణ రోజుల్లో 180 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉంటుందన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ దువ్వూరి, ఏపిఈపీడీసీఎల్ సీఎండీ సంతోష్ కుమార్, పి, జనార్ధన రెడ్డి, ఏ పి ట్రాన్స్ కో జె.ఎమ్.డీ. ఐ. పృథ్వి రాజ్ పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+