ఏపీలో 259 కరోనా కేసులు..: ఐదుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతూ.. తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 33,437 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 259 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 48 కేసులు నమోదు కాగా... కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో ఐదుగురు కరోనా కారణంగా మృతి చెందారు. 354 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు 20,66,929 కేసులు నమోదు కాగా... 20,48,505 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 14,382 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,042 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. వైరస్‌ను జయించేందుకు రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనిపై ప్రకటన రాలేదు.

Recommended Video

    interview with bjp state president bandi sanjay on huzurabad by poll trends
    259 people infected corona in andhra pradesh

    ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు థర్డ్ వేవ్ ఇంపాక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దానిని దాటేస్తే గానీ.. పరిస్థితి ఏంటో చెప్పలేమని ఒకవిధంగా వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకైనా మంచిది కాస్త అలర్ట్‌గా ఉండాలని మాత్రం సూచిస్తున్నారు. సో బీకెర్ ఫుల్

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+