అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిబిఐ వ‌ర్సెస్ ఏసిబి : ఏపిలో కొత్త వివాదం..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో కేంద్ర - రాష్ట్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల మ‌ధ్య వివాదం మొద‌లైంది. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సిబిఐ..రాష్ట్ర అవినీతి నిరోధ‌క శాఖ ఏసీబీ ల మ‌ధ్య తాజాగా ఓ కేంద్ర ప్ర‌భుత్వ అధికారి ట్రాప్ విష‌యం వివాదానికి కార‌ణ‌మైంది. లంచం డిమాండ్‌ చేసిన కేంద్ర పరోక్ష పన్నుల విభాగానికి చెందిన ఓ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకోవడం, అవినీతి అధికారులను పట్టుకోవడానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లీక్‌ చేసిందని సీబీఐ ధ్వజమెత్తడం వివాదాస్పదమైంది.

రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ఓ వివాదాస్ప‌ద నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ నేరుగా దర్యాప్తు జరిపేందుకు అనుమతి రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణ‌యం ఆధారంగా ఏపి ఏసీబి ఈ వ్య‌వ‌హారంలో త‌న ప‌ని తాను చేసుకు పోయింది. అదే విష‌యం పై సిబిఐ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. లంచం డిమాండ్‌ చేసిన కేంద్ర పరోక్ష పన్నుల విభాగానికి చెందిన ఓ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకోవడం, అవినీతి అధికారులను పట్టుకోవడానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లీక్‌ చేసిందని సీబీఐ ధ్వజమెత్తడం ఇప్పుడు వివాదానికి కార‌ణ‌మైంది.

ACB case against central officer : CBI vs ACB..!

ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని కేంద్ర సీజీఎస్టీ రేంజ్‌ అధికారి ముక్కు కాళీ రమణేశ్వర్‌పై లంచం తీసుకున్న కేసులో రాష్ట్ర ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. వాస్తవానికి కాళీ రమణేశ్వర్‌పై విశాఖ సీబీఐ అధికారులకు ముందుగా ఫిర్యాదు అందింది. దీనిపై విచారించేందుకు సీబీఐ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరింది. అంతేకాక.. విశాఖ నుంచి సీబీఐ ఎస్పీ స్థాయి అధికారి రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని సచివాలయంలో వ్యక్తిగతంగా కలిసి ఈ విషయంలో గోప్యత పాటించాలని కూడా విజ్ఞప్తి చేశారు

కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ వినతిని బేఖాతరు చేస్తూ సమాచారాన్ని ఏసీబీకి లీక్‌ చేసింది. దీంతో వారు రమణేశ్వర్‌పై కేసు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి మరీ ఈ కేసు నమోదు చేయడం ఇప్పుడు సీబీఐ, ఏసీబీలలో తీవ్ర దుమారం రేపుతోంది. కాగా, దర్యాప్తు చేయడానికి సహకారం అందించకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఏసీబీ వ్యవహరించిన తీరును సీబీఐ విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రంగా తప్పుబట్టింది. ఏది ఏమైనా కేంద్ర ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌న గా తీము తీసుకున్న నిర్ణ‌యానికి కట్టుబ‌డి ఉండాల్సిందేన‌ని. ఎటువంటి ప‌రిస్థితుల్లో వెన‌క్కు త‌గ్గ‌కూడ‌ద‌ని ఏపి ప్ర‌భుత్వం గ‌ట్టిగా ఉంది. తాజా ఘ‌ట‌న‌తో సిబిఐ కి మ‌ద్ద‌తు గా కేంద్రం స్పందిస్తుందా లేదా..ఎటువంటి అడుగులు వేస్తుందో చూడాలి.

English summary
ACB case against central officer in AP. It create new dispute between AP ACB and CBI. ACB filed case aginst CGST officer in Machilipatnam. CBI openly differed with AP Govenrment decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X