అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్ర‌బాబు కు రాహుల్ బంప‌రాఫ‌ర్ : ఏపి రాజ‌కీయాల్లో కొత్త ట్విస్ట్..ఇద్ద‌రి టార్గెట్ అత‌డే..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : బాబు కే నిర్ణ‌యాధికారం.. రాహుల్, బాబు టార్గెట్ అత‌డే..! | Oneindia Telugu

ఏపి రాజ‌కీయాల్లో కొత్త ట్విస్ట్. ఏపి లో కాంగ్రెస్ లో నిర్ణ‌యాధికారం సైతం ప‌రోక్షంగా చంద్ర‌బాబుకే అప్ప‌గించిన‌ట్లుగా రాహుల్ వ్యాఖ్య‌లు క‌నిపిస్తున్నాయి. జాతీయ రాజ‌కీయాల పేరుతో ఒకే వేదిక పైకి వ‌చ్చిన రాహుల్ - చంద్ర‌బాబు తెలంగా ణ‌లో క‌లిసి పోటీ చేస్తున్నారు. తెలంగాణ‌లో అధికారం కోసం కాకుండా కెసిఆర్ ను గ‌ద్దె దింప‌ట‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు కాంగ్రెస్ తో క‌లిసి ప‌ని చేస్తున్నారు. ఇందు కోసం కేవ‌లం 13 సీట్ల‌తో స‌రి పెట్టుకున్నారు. ఎక్కువ సీట్ల డిమాండ్ ను సైతం ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. దీంతో...రాహుల్ వ‌ద్ద చంద్ర‌బాబు ప‌ర‌ప‌తి బాగా పెరిగింది. ఒక ర‌కంగా ఏపి - తెలంగాణ లో చంద్ర‌బాబు చెప్పిన విధంగా రాహుల్ నిర్ణ‌యాలు తీసుకొనే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇందులో భాగంగానే.. ఏపి భ‌విష్య‌త్ రాజ‌కీయాల పై రాహుల్...చంద్ర‌బాబుకు బంపరాఫ‌ర్ ఇచ్చారు. కానీ, ఇది కాంగ్రెస్ నేత‌ల‌కు మింగుడు ప‌డ‌టం లేదు.

చంద్ర‌బాబు వ్యూహం.. రాహుల్ స‌హ‌కారం..

చంద్ర‌బాబు వ్యూహం.. రాహుల్ స‌హ‌కారం..

తెలంగాణ ఎన్నిక‌ల్లో టిడిపి - కాంగ్రెస్ పొత్తు త‌మ‌కు లాభించిన‌ట్లు కాంగ్రెస్ అధినేత రాహుల్ అంచ‌నాకు వ‌చ్చారు. తెలంగాణ ఫార్ములానే ఏపిలోనే అమ‌లు చేయాల‌ని భావిస్తున్నారు. తెలంగాణ లో త‌మ‌కు చంద్ర‌బాబు స‌హ‌క‌రించిన విధంగానే ఏపిలో తాము స‌హ‌క‌రించేందుకు ముందుకొస్తామ‌ని రాహుల్ స్ప‌ష్ట‌మైన సంకేతాలు చంద్ర‌బాబుకు ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఏపిలో టిడిపి అధికారంలో ఉంది..

కాంగ్రెస్ కు ప్ర‌స్తుతం ఒక్క సీటు కూడా లేదు. అక్క‌డ ఇద్ద‌రికీ ఉమ్మ‌డి శ‌త్రువు జ‌గ‌న్‌. జ‌గ‌న్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవ‌టం ఇప్పుడు రెండు పార్టీల ల‌క్ష్యం. ఇందులో బాగంగానే.. రెండు పార్టీల అధినేత‌లు స‌ర్దుబాటు ధోర‌ణ‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏపిలో అధికారం నిల‌బెట్టుకోవ‌టం చంద్ర‌బాబుకు రాజ‌కీయంగా అనివార్యం. అందు కోసం తెలంగాణ‌లో రాజీ ధోర‌ణితో కాంగ్రెస్ తో వ్య‌వ‌హారించారు. ఇప్పుడు ఏపిలోనూ కాంగ్రెస్ అదే ధోర‌ణితో త‌న‌కు స‌హ‌క‌రించాల‌ని చంద్ర‌బాబు కోరుకుంటున్నారు. ఆయ‌న కోరుకున్న విధంగానే రాహుల్ సంసిద్ద‌త వ్య‌క్తం చేస్తున్నారు. స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పిన‌ట్లు సమాచారం.

బాబు కే నిర్ణ‌యాధికారం..

బాబు కే నిర్ణ‌యాధికారం..

తెలంగాణ‌లో కాంగ్రెస్ చెప్పిన‌ట్లుగా టిడిపి స‌హ‌క‌రించింది. దీంతో.. ఏపిలో అధికారంలో ఉన్న చంద్ర‌బాబు చెప్పిన‌ట్లు గా న‌డుచుకోవ‌టానికి కాంగ్రెస్ అధినేత సంసిద్ద‌త వ్య‌క్తం చేస్తున్నారు. క‌లిసి పోటీ చేసినా..విడివిడిగా పోటీ చేసినా ఏమై నా చంద్ర‌బాబు ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగానే ముందుకు వెళ్ల‌నున్నారు. ఏ ర‌కంగా పోటీ చేస్తే..రాజ‌కీయంగా రెండు పార్టీల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుందో మీరే నిర్ణ‌యించాలంటూ చంద్ర‌బాబు కే అధికారం అప్ప‌గించారు కాంగ్రెస్ అధి నేత రాహుల్ గాంధీ. ఏ రాష్ట్రంలో అయినా బ‌ల‌మైన పెద్ద పార్టీ చెప్పిన‌ట్లుగా..మిత్ర ప‌క్షం వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుం ద‌నే లెక్క‌ల‌కు అనుగుణంగా రాహుల్ గాంధీ ఈ నిర్ణ‌యానికి వ‌చ్చారు. దీంతో..ఇప్పుడు ఏపిలో ముఖ్య‌మంత్రి చంద్ర బాబు అమలు చేసే వ్యూహాల‌కు అనుగుణంగా ఏపి కాంగ్రెస్ స‌హ‌క‌రించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. 2014 ఎన్నిక‌ల్లో బిజెపి తో పొత్తు పెట్టుకొని ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన టిడిపి..ఇప్పుడు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో పొత్తు పై మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు అధికారికంగా ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. దీని పై ఇంకా నిర్ణ‌యం జ‌ర‌గలేద‌ని రెండు పార్టీల నేత లు చెబుతున్నారు. అయితే, ఏపిలోనూ పొత్తు కొన‌సాగించాల‌ని రాహుల్ -చంద్ర‌బాబు మ‌ధ్య జ‌రిగిన మంత‌నాల ద్వారా నిర్ణ‌యించిన‌ట్లు అర్ద‌మ‌వుతోంది.

ఏపి కాంగ్రెస్ నేత‌ల‌కు సంక‌టం..

ఏపి కాంగ్రెస్ నేత‌ల‌కు సంక‌టం..

ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ స్వ‌యంగా... టిడిపి అధినేత కు ఏపిలో పొత్తు విష‌యం పై నిర్ణ‌యాధికారం వ‌ది లేయ‌టం ఏపిలోని కాంగ్రెస్ నేత‌ల‌కు అంత‌గా రుచించ‌ని విష‌యం. పైకి హైక‌మాండ్ నిర్ణ‌య‌మే త‌మ‌కు శిరోధార్య‌మ‌ని చెబుతున్నా.. లోలోప‌ల మాత్రం త‌మ పై పార్టీ పై చంద్ర‌బాబు ప‌రోక్షంగా పెత్త‌నం చేసే ప‌రిస్థితులు ఏర్ప‌డ‌టం వారికి న‌చ్చ‌టం క‌ష్ట‌మే. ఇదే స‌మ‌యంలో...పిసిసి అధ్య‌క్షుడు తాము ఏపిలో పొత్తు పై ఏఐసిసి నిర్ణ‌యానికి అనుగుణంగా వ్య‌వ హ‌రిస్తామ‌ని చెబుతున్నారు. ఇక‌, రాహుల్ తాజా ప్ర‌తిపాద‌న తో ఎక్క‌డ కాంగ్రెస్ పోటీ చేయాలో..ఎన్ని సీట్ల‌లో పోటీ చేయాలో సైతం ఒక ర‌కంగా చంద్ర‌బాబు డిసైడ్ చేసే ప‌రిస్థితి ఏర్ప‌డింది.

కాంగ్రెస్ - టిడిపి పొత్తుతో కాంగ్రెస్ లోని వ‌ట్టి వ‌సంత కుమార్‌, సి రామ‌చంద్ర‌య్య లాంటి వారు పార్టీకి రాజీనామా చేసారు. ఇక‌, రాహుల్ తాజా ప్ర‌తిపాద‌న‌.. చంద్రబాబు కు నిర్ణ‌యాధికారం అప్ప‌గించ‌టం తో కాంగ్రెస్ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అదే స‌మ‌యం లో అన్ని సీట్ల‌కు తాము పోటీ చేసినా అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని..ఇప్పుడు టిడిపి తో క‌లిసి జ‌గ‌న్ ను అడ్డుకుం టే భ‌విష్య‌త్ లో త‌మ‌కు అవకాశం ఉంటుంద‌ని కొంద‌రు నేత‌లు విశ్లేషిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో..కాంగ్రెస్ తో పొత్తు పై టిడిపి సీనియ‌ర్లు సైతం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

English summary
AICC President given open offer to TDP chief Chandra Babu Naidu. Rahul offered congress support in Ap and alliance may contest as per Chandra Babu decision. This development may lead to new political developments in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X