ఏపీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ యూనివర్సిటీల పరిధిలో జరిగే కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలను విడుదల చేశారు. శుక్రవారం ఒక ప్రకటనలో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఆయా పరీక్షల నిర్వహణకు చైర్మన్, కన్వీనర్లను నియమించిన తర్వాత వివరాలను విడుదల చేశారు. అందుకు సంబందించిన తేదీలు, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆగస్టు 19-25 ఈఏపీ సెట్‌ పరీక్షా ఉండగా నిర్వహణ బాధ్యతను జెఎన్టీయూ కాకినాడకు అప్పగించారు. సెప్టెంబర్ 17,18 తేదీల్లో ఐ సెట్‌ పరీక్ష నిర్వహిస్తారు. దీని బాధ్యత విశాఖపట్టణంలో గల ఆంధ్ర యూనివర్సిటీ అప్పగించారు. సెప్టెంబర్ 19న ఈ సెట్‌ ఉంటుంది. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను జెఎన్టీయూ అనంతపురం చేతికి అప్పగించారు.

andhra pradesh entrance exam schedule released

సెప్టెంబర్ 27-30 తేదీల్లో పీజీ ఈసెట్‌ పరీక్షలు ఉండగా ఎస్వీయూ తిరుపతికి బాధ్యతలు అప్పగించారు. సెప్టెంబర్ 21న ఎడ్‌ సెట్‌ పరీక్ష ఉండగా నిర్వహణ బాధ్యతను విశాఖ ఆంధ్ర యూనివర్సిటీకి అప్పగించారు. సెప్టెంబర్ 22న లా సెట్‌ నిర్వహిస్తుండగా.. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీకి నిర్వహణ బాధ్యత అప్పగించారు.

ఇటు కరోనా వల్ల పరీక్షల తేదీలు పొడగిస్తు వస్తున్నాయి. విద్యార్థులను ప్రమోట్ చేస్తుండగా.. ప్రవేశ పరీక్షలను మాత్రం నిర్వహిస్తున్నారు. వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+