అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుడ్ న్యూస్: డీఏ బకాయిలు విడుదల, పెండింగ్ మొత్తం

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలను ఏపీ సర్కార్ విడుదల చేసింది. 2019 జూలై నుంచి 2021 డిసెంబర్ 31 వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలను విడుదల చేసింది. ఇటీవల సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ప్రకటన మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులపే ఇచ్చింది. పీఆర్‌సీకి సంబంధించి 23 శాతం ఫిట్‌మెంట్ అమలు చేస్తూ మరో జీవోను ప్రభుత్వం విడుదల చేసింది.

ఏప్రిల్ 1, 2020 నుంచి మోనిటరీ బెనిఫిట్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గతేడాది డిసెంబర్‌లో సీఎం జగన్ ఉద్యోగ.. ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ కు అనుగుణంగా వచ్చే జనవరి నెల నుంచి డీఏను జమ చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఉద్యోగులకు 2019 జూలై ఒకటి నుంచి డీఏ బకాయిలను విడుదల చేయడానికి ఆర్దికశాఖ డిసెంబర్ లోనే అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది. నెలకు 5.24 శాతం డీఏ బకాయిలు విడుదల చేయాలని ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. తాజాగా దీనిపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది.

 andhra pradesh government release da and prc

సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఇటీవలే అందించారు. ఉద్యోగులు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్న పీఆర్సీతో పాటు.. కీలక వరాలు కురిపించారు. ముఖ్యంగా గత కొంతకాలంగా వివాదంగా మారిన పీఆర్సీని ప్రకటించారు. 23 శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్టు చెప్పారు. దీంతో పాటు పలు హామీల వర్షం కురిపించారు.

70 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్న పెన్షనర్లకు అదనంగా 10 శాతం పెన్షన్ ఇవ్వాలని కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. పెండింగ్‌లో ఉన్న5 డీఏలు వెంటనే చెల్లించాలన్నారు. ముఖ్యంగా సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు భత్యాలు కొనసాగించాలని విజ్జప్తి చేశారు. వీటితో పాటు ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1993 నుంచి పనిచేస్తున్న కంటింజెంట్, ఒప్పంద సిబ్బందిని క్రమబద్దీకరించాలని కోరింది.. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెబుతున్నారు.

ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తున్నట్టు ప్రకటించింది.. ఈ నిర్ణయం వల్ల ఏటా ఖజానాపై 10 వేల 247 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు.

English summary
andhra pradesh government release da and prc. recently cm jagan assure to employees, than government release the payments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X