అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్ని, గవర్నర్ ఆమోదం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఎస్ఈసీ ఎంపికపై స్పష్టత వచ్చింది. మాజీ సీఎస్ నీలం సాహ్నినిని కొత్త ఎస్‌ఈసీ చేయాలని అనుకుంది. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌కు ప్రతిపాదనలు పంపించింది. ఆమె నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారుగా సాహ్ని బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఈ నెలాఖరుతో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో ఎస్ఈసీని నియమించారు. సీఎం ముఖ్య సలహాదారు పదవీకి రాజీనామా చేసి.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా సాహ్ని బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నీలం సాహ్ని పదవీ కాలం ముగియడంతో ముఖ్య సలహాదారుగా సీఎం జగన్ నియమించుకున్నారు.

andhra pradesh new sec neelam sahani

పంచాయతీ ఎన్నికల వాయిదాపై ఏపీ ప్రభుత్వంపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మధ్య వివాదం చెలరేగింది. ఆయన నియామకం చెల్లదని.. హైకోర్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. తిరిగి ఆయన బాధ్యతలు చేపట్టి స్థానిక ఎన్నికలను నిర్వహించారు. ఈ నెల 31వ తేదీతో ఆయన పదవీకాలం ముగియనుంది. దీంతో కొత్త ఎస్ఈసీని నియమించారు.

English summary
andhra pradesh new sec neelam sahani. governer harichandan agree to her appoinment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X