అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపి డిజిపిని మార్చాలి : ఆ ఓట్ల‌ను తిరిగి చేర్చండి : ఎన్నిక‌ల సంఘానికి బిజెపి ఫిర్యాదు..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో అధికార పార్టీ త‌మ‌కు అనుకూలంగా లేని వారి ఓట్ల‌ను తొలిగించార‌ని..వాటిని తిరిగి చేర్చాల‌ని ఏపి బిజెపి నేత లు కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని కోరారు. రాష్ట్రంలో అధికారులు టిడిపికి అనుకూలంగా ఉన్నార‌ని ఫిర్యాదు చేసారు. ఏపి డిజిపి ని మార్చాల‌ని బిజెపి నేత‌లు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి విజ్ఞ‌ప్తి చేసారు.

AP BJP leaders demand for change of DGP from elections duty : complaint on TDP

ఆ ఓట్లను తిరిగి చేర్చిండి..
ఏపి బిజెపి అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ నేతృత్వంలో ఆ పార్టీ నేత‌లు కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసారు. ఏపి లో ఓట్ల తొలిగింపు పై ఫిర్యాదు చేసారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేనివారి ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించా రు. టీడీపీ ప్రభుత్వం తొలగించిన ఓట్లను తిరిగి చేర్చాలని సీఈసీని కోరినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అధికారులు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు మతిస్థిమితం సరిగా లేదని కన్నా వ్యాఖ్యానించారు. ఆధార్‌, ఓటర్‌ జాబితా, ప్రభుత్వ పథకాల లబ్దిదారుల వివరాలను ఏపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించిన వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ సేవామిత్ర యాప్‌లో ఏపీ ప్రజల ఓటార్‌ ఐడీ కార్డు వివరాలు, ఆధార్‌ వివరాలు ఉన్న విషయంపై జోక్యం చేసుకోవాలని, థర్డ్‌ పార్టీ విచారణ జరిపించి తక్షణం చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

మాకు మేమే పోటీ .. మెజార్టీలో పోటాపోటీ ... మెదక్ సభలో కేటీఆర్ సవాల్ మాకు మేమే పోటీ .. మెజార్టీలో పోటాపోటీ ... మెదక్ సభలో కేటీఆర్ సవాల్

డిజిపిని మార్చాలి..!
ఆంధ్రప్రదేశ్ డీజీపీని మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా ఏపీలోని అధికార యంత్రాంగం టీడీపీకి తొత్తుగా వ్యవహరిస్తోందని కన్నా విమర్శలు గుప్పించారు. ఓట్ల తొగింపుపై సరైన విచారణ జరగకుండా ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో న్యాయం జరుగదని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, ఏపీ డీజీపీని మార్చాలని డిమాండ్‌ చేశారు. ఫారం-7 ఎవరైనా దాఖలు చేయొచ్చని ఎంపీ జీవీఎల్‌ అన్నారు. దొంగ ఓట్లను తొలగించకుండా ఉండేందుకు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నార ని మండిపడ్డారు. నామినేష‌న్ల చివ‌రి రోజు వ‌ర‌కు ఓట‌రు గా న‌మోదు చేసుకొనే అవ‌కాశం ఉంద‌ని..అదే విధంగా పారం - 7 పై నా అదే నిబంధ‌న వ‌ర్తిస్తుంద‌ని బిజెపి నేత‌లు స్ప‌ష్టం చేసారు.

English summary
AP BJP President Kanna Lakshmi Narayana and party leaders met central eletion commission to complaint on AP Govt. TDP removing other party supporters votes. BJP requested to add that removed votes in AP. BJP leaders also demanded for change present AP DGP for elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X