వైజాగ్ సమ్మిట్ సక్సెస్- మంత్రులు, అధికారులకు జగన్ అభినందనలు-ఇక చేయాల్సిందిదే..

వైజాగ్ లో ఏపీ సర్కార్ తాజాగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సు ద్వారా రూ.13 లక్షలకోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు రావడంపై ప్రభుత్వం సంతోషంగా ఉంది.

అమరావతి : ఏపీలో వైసీపీ సర్కార్ గత వారం పెట్టుబడుల సదస్సు నిర్వహించింది. తద్వారా రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత స్ధాయిలో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. అంబానీ, అదానీ, దాల్మియాలు తరలివచ్చారు. దీంతో సదస్సు విజయవంతమైనట్లు ప్రభుత్వం ప్రకటించింది.

విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతం చేయడంలో భాగస్వాములైన సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇవాళ అభినందించారు. విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్, రెండు రోజుల్లో రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు రావడంతో పాటు , 378 ఒప్పందాలు కుదిరాయి. ఇవన్నీ కార్యరూపం దాలిస్తే 6.09 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. దీనిపై సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు.

వైజాగ్ సదస్సులో కుదుర్చుకున్న ఎంవోయూల అమలు దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధ్యక్షతన ముఖ్యమంత్రి ఓ కమిటీ కూడా ఏర్పాటు చేశారు.

ap cm ys jagan appreciate ministers, officials for vizag investors summit success-key directions

ఈ కమిటీ ప్రతివారం సమావేశమై సదస్సులో కుదిరిన ఎంవోయూల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఇవాళ సీఎం జగన్ ను కలిసిన వారిలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్‌ వలవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ డా.జి. సృజన, ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ ఎండీ ఎస్‌.షన్‌మోహన్‌ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+