అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ ఫస్ట్.. కరోనా వ్యాక్సినేషన్‌లో ముందువరసలో... దేశ యావరేజీ కన్నా

|
Google Oneindia TeluguNews

కరోనా వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్ దేశ సగటు కంటే ముందువరుసలో నిలిచింది. ఇతర రాష్ట్రాలకు కేటాయించిన టీకా డోసులతో పోలిస్తే ఏపీకి తక్కువ డోసులు కేటాయించారు. అయినా ఏపీలో వ్యాక్సిన్లు అందజేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు టీకాల సంఖ్య 21,69,00,642గా నమోదు కాగా.. మొత్తం జనాభాతో పోలిస్తే టీకాలు తీసుకున్నవారు 3.2శాతంగా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వేసిన టీకాలు 1,02,45,680 కాగా.. 4.72 శాతం ఉంది. దేశవ్యాప్తంగా మొదటి డోసు టీకాలు తీసుకున్నవారు 17,29,85,046 మంది ఉంటే.. ఏపీలో మొదటి డోసు తీసుకున్నవారు మాత్రం 76,97,73గా ఉన్నారు. దేశం మొత్తం మొదటి డోసు టీకా తీసుకున్న వారి సంఖ్యతో పోలిస్తే.. ఏపీలో మొదటి డోసు టీకా తీసుకున్నవారి శాతం 4.45గా ఉంది. దేశ వ్యాప్తంగా రెండో డోసు తీసుకున్నవారు 4,39,15,596 ఉంటే.. ఏపీలో రెండో డోసు టీకా తీసుకున్నవారు 25,47,942 మంది ఉన్నారు.

AP covid vaccination takes first line..

దేశవ్యాప్తంగా రెండో డోసు టీకా తీసుకున్న వారి సంఖ్యతో పోలిస్తే ఏపీలో రెండో డోసు టీకా తీసుకున్నవారి శాతం 5.80గా నమోదైంది. దేశం మొత్తం జనాభా 136.64 కోట్లు కాగా.. కనీసం ఒక డోసు టీకా తీసుకున్నవారి సంఖ్య 17,29,85,046 ఉండగా.. మొత్తంగా 12.68శాతంగా ఉందని గణాంకాలు వెల్లడించాయి.

ఏపీ జనాభా 5.2 కోట్లు ఉండగా.. ఏపీలో కనీసం ఒక డోసు టీకా తీసుకున్నవారి సంఖ్య 76,97,738 ఉండగా 14.80 శాతంగా నమోదైంది. దేశంలో 136.64 కోట్ల జనాభాలో రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య 4,39,15,596 గా ఉంటే.. అంటే 3.2శాతంగా ఉంది. ఏపీ జనాభా 5.2 కోట్ల మందిలో రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య 25,47,942తో 4.9 శాతంగా ఉంది. కరోనాకు వ్యాక్సిన్ శ్రీరామ రక్ష అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అలా పౌరులకు అందజేసేందుకు ఏపీ ప్రభుత్వ అధికారులు/ సిబ్బంది విశేష కృషి చేశారు. దాని ఫలితమే నేషనల్ యావరేజీ దాటడం.

English summary
AP covid vaccination takes first line of average in national vaccination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X