అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డేటా చోరీలో కీలక మలుపు: తెలంగాణ ప్రభుత్వానికి షాకివ్వనున్న టీడీపీ, సంచలన నిర్ణయం

|
Google Oneindia TeluguNews

Recommended Video

TDP Leaders Are Ready To Objection Over Telangana Govt On Data Theft | Oneindia Telugu

అమరావతి: డేటా చోరీ ఎపిసోడ్ కీలక మలుపులు తిరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్‌గా ఉంది. టీడీపీ డేటా పోయిందని తెలంగాణ ప్రభుత్వంపై కేసు పెట్టాలని తెలుగుదేశం పార్టీ బుధవారం నిర్ణయించింది. తెలంగాణ సర్కారు సమాచారం చోరీ చేసిందని కేసు ఫైల్ చేయాలని ఏపీ టీడీపీ నేతలు భావిస్తున్నారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేయాలని ఆలోచిస్తోంది.

<strong>షాకింగ్: 'వైయస్ వివేకానంద ఓటు తొలగించిందే జగన్, ఎందుకంటే, ఫారం 7 విషయంలోనూ..'</strong>షాకింగ్: 'వైయస్ వివేకానంద ఓటు తొలగించిందే జగన్, ఎందుకంటే, ఫారం 7 విషయంలోనూ..'

 గుంటూరులో కేసు పెట్టాలని నిర్ణయం

గుంటూరులో కేసు పెట్టాలని నిర్ణయం

డేటా చోరీ కేసులో తెలంగాణ ప్రభుత్వం పైన, పోలీసుల తీరు పైన గుంటూరులో కేసు పెట్టాలని టీడీపీ నిర్ణయించిందని తెలుస్తోంది. ఈ మేరకు నేడో రేపో కేసు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. డేటా చోరీ కేసులో ఏ రకంగా ముందుకెళ్లాలనే అంశంపై టీడీపీ అన్ని కోణాల్లో ఆలోచిస్తోంది. ఈ అంశంపై చంద్రబాబు రెండు రోజుల క్రితమే ఏజీ దమ్మాలపాటితో భేటీ అయ్యారు. ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై టీడీపీ యోచిస్తోంది. ఇందులో భాగంగా హైకోర్టుకు వెళ్లాలని యోచిస్తోంది.

కేసును ఏపీకి బదలీ చేయాలని కూడా పిటిషన్ దాఖలు చేసే ఛాన్స్

కేసును ఏపీకి బదలీ చేయాలని కూడా పిటిషన్ దాఖలు చేసే ఛాన్స్

అలాగే, డేటా చోరీ అంశం ఏపీకి సంబంధించిన అంశమని, కాబట్టి ఈ కేసును ఏపీకి బదలీ చేయాలని కూడా ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుందని తెలుస్తోంది. ఇందుకోసం కసరత్తు చేస్తోంది.

తెలంగాణ ప్రభుత్వానికి లోకేష్ ప్రశ్న

తెలంగాణ ప్రభుత్వానికి లోకేష్ ప్రశ్న

డేటా చోరీపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. హైదరాబాదులో మా డేటా చోరీ చేయడం నేరం కాదా అని ప్రశ్నించారు. హైదరాబాదులోనే దీనిని జగన్‌కు అందించారన్నారు. హైదరాబాదులో ఉన్న వైసీపీ కాల్ సెంటర్ నుంచి టీడీపీ కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పారు. ఇది చట్టాల ఉల్లంఘన కిందకు రాదా అని ప్రశ్నించారు. అన్ని అక్రమాలు హైదరాబాదులోనే జరుగుతున్నాయన్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోదా అని ప్రశ్నించారు. జగన్, కేటీఆర్ జోడీ అనడానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా అని ప్రశ్నించారు.

English summary
andhra pradesh government and tdp leaders are ready to complaint against telangana government over data theft.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X