కీలక పరిణామం: మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం.. ఇవాళ భేటీ
పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సై అంటే సై అనే పరిస్థితి ఏర్పడింది. ముందు చర్చలకు రండి.. అని ప్రభుత్వం అంటుంటే, ముందు మా డిమాండ్లు పరిష్కరించండి తర్వాతే చర్చలు అని ఉద్యోగ సంఘాలు పట్టు పట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. చర్చలకు రావాలని ప్రభుత్వం లిఖితపూర్వకంగా కోరితే స్పందిస్తామని ఉద్యోగులు పేర్కొంటున్న నేపథ్యంలో, ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. చర్చలకు రావాలంటూ మరోసారి ఉద్యోగ సంఘాలకు అధికారికంగా లేఖ రాసింది.
Recommended Video

సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉద్యోగ సంఘాలకు లేఖ పంపారు. చర్చలకు ఉద్యోగ సంఘాలను ఆహ్వానించారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రుల కమిటీతో సమావేశం ఉంటుందని ఆ లేఖలో తెలిపారు. స్టీరింగ్ కమిటీ నుంచి 20మంది సభ్యులు చర్చలకు రావొచ్చని లేఖలో తెలిపారు. మరోవైపు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తున్నా.. తాము చర్చలకు రావడం లేదని తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. అందులో వాస్తవం లేదని వివరణ ఇచ్చారు. మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇంతలో ప్రభుత్వం నుంచి చర్చలకు ఆహ్వానం రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్రంలో పీఆర్సీ వివాదం ముదురుతోంది. ఈ విషయంలో ఇటు ప్రభుత్వం కానీ.. అటు ఉద్యోగులు కానీ వెనక్కి తగ్గడం లేదు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం పట్టుబడుతుంటే.. ఉద్యోగులు మాత్రం ససేమిరా అంటున్నారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన పీఆర్సీ జీవోలతో తమకు అన్యాయం జరుగుతుందనేది ఉద్యోగుల వాదన. కొత్త పీఆర్సీ వలన ప్రభుత్వంపై సుమారు రూ.10,500 కోట్ల మేర అదనపు భారం పడుతోందని అలాంటప్పుడు జీతాలు ఎలా తగ్గుతాయనేది ప్రభుత్వ వర్గాల వాదన. తమ డీఏలు, హెచ్ఆర్ఏ, పాత బకాయిలు కలపడం వలనే తమకు జీతం పెరిగిందని ప్రభుత్వం ప్రచారం చేస్తుందని.. అవి తమకు రావలసిన బకాయిలు మాత్రమే అనేది ఉద్యోగుల వాదన. తాము అడుగుతున్నట్లు పాత విధానంలోనే తమ జీతాలు చెల్లిస్తే వారి లెక్కల ప్రకారమే ప్రభుత్వంపై పడిన రూ.10,500 కోట్ల భారం తగ్గుతుంది కదా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications