అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ ఎమ్మెల్యేకు భారీ ఊరట: గనుల లీజు రద్దు ఉత్తర్వులు కొట్టేసిన హైకోర్టు

|
Google Oneindia TeluguNews

అమరావతి: హైకోర్టు తాజా తీర్పుతో గనుల లీజు రద్దు వ్యవహారంలో ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు ఊరట లభించింది. గనుల లీజును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.

తమ గనుల లీజును మైనింగ్ శాఖ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ గొట్టిపాటి రవి, పోతుల రామారావు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది.

AP High Court Dismissed the Mining lease Cancel Order

కాగా, మార్చి నెలలో ఈ ఇద్దరు నేతల గనులకు సంబంధించి మైనింగ్ అధికారులు డిమాండ్ నోటీసులు పంపారు. దీనిపై గతంలోనే బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో డిమాండ్ నోటీసులు ఇచ్చిన కేసులో ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది.

ఆ తర్వాత గనుల లీజును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో డిమాండ్ నోటీసుపై స్టే ఉండగా లీజు ఎలా రద్దు చేస్తారంటూ పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం.. గనుల లీజు రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. దీంతో గొట్టిపాటి రవి, పోతుల రామారావుకు భారీ ఊరట లభించినట్లయింది.

ఏపీ ప్రభుత్వానికి మరో షాక్

ఏపీ సర్కారు హైకోర్టులో మరో షాక్ తగిలింది. బిల్డ్ ఏపీ పేరుతో విశాఖలో అమ్మాలనుకున్న ఆరు స్థానాల్లో రెండు స్థలాల హైకోర్టు స్టే విధించింది. చినగదిలి మండలంలోని చినగదిలి మండలం డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్‌లో 75 సెంట్ల స్థలం, ఏఆర్ పోలీస్ క్వార్టర్స్‌లో ఎకరం స్థలంపై హైకోర్టు స్టే ఇచ్చింది.

అగనంపూడిలో భూముల విక్రయంపైనా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా,
ఈ పిటీషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం.. బిల్డ్ ఏపీ పేరుతో విశాఖలో అమ్మాలనుకున్న ఆరు స్థానాల్లో రెండు స్థలాల హైకోర్టు స్టే విధించింది.

కాగా, గుంటూరు, విశాఖ జిల్లాలలోని కొన్ని భూములను ఇ--వేలంవేయడానికి నోటిఫికేషన్ కూడా జారీ అయ్యింది. ఈ పథకం ద్వారా అవసరం లేని ప్రభుత్వ భూములను మార్కెట్ ధరకు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు విక్రయించాలని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చుకోసమే బిల్డ్ ఏపీ ఉద్దేశం.

Recommended Video

AP 3 Capitals పై High Court స్టేటస్ కో మళ్లీ పొడిగింపు- ఏపీ వికేంద్రీకరణ! || Oneindia Telugu

బిల్డ్ ఏపీ మిషన్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక స్టేట్ లెవెల్ మోనిటరింగ్ కమిటీ (ఎస్‌ఎల్‌ఎంసి) ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంభంధించి జిఓ నంబర్ 447ను విడుదల చేశారు.

English summary
AP High Court Dismissed the Mining lease Cancel Order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X